వినాయక చవితి అంటే గుర్తొచ్చేది రెండే రెండు.. ఒకటి నిమజ్జనం, రెండు వేలం.. నిమజ్జనం అంటే ప్రతిఒక్కరి ఒంట్లో తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ ఉత్సాహం ఎందుకంటే ఆ వేడుక అలాంటిది మరి. నిమజ్జనం అనేది మాములు విషయం కానీ లడ్డు వేలం అనేది 1994 లో మొదటిసారి బాలాపూర్ గణేష్ లడ్డు వేలం ప్రక్రియ మొదలయింది. 


ఇప్పటివరకు ప్రతి ఏటా వివిధ వినాయక మండపాల దగ్గర లడ్డును వేలం వేస్తున్నారు. నవరాత్రులు వినాయకుడికి ఘనంగా పూజలు చెయ్యడంతో లడ్డుకు ప్రాధాన్యం ఏర్పడింది. అది కాకా ఆ లడ్డుని ఎవరైతే సొంతం చేసుకుంటారో వారికీ కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు. లడ్డుకు పెట్టిన సొమ్ముకు డబల్ సొమ్ము వస్తుందని, ఆ లడ్డుని పొలంలో చల్లడం వల్ల మంచి జరుగుతుందని అందరూ భావిస్తారు. 


దీంతో లడ్డు ధర ఎంతైనా సరే వేలం పాటలో పాల్గొని పోటాపోటీగా పాడి లడ్డుని దక్కించుకుంటున్నారు భక్తులు. అదే తరహాలో హైదరాబాద్ భోలక్‌పూర్ డివిజన్‌లో శ్రీ సిద్ధి వినాయక భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ కొన్నేళ్లుగా గణేశ్ మండపం ఏర్పాటు చేస్తున్నారు. అలా ఇక్కడ కూడా లడ్డు వేలం ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రసాదం లడ్డుతో పాటు బంగారు లడ్డును ఏర్పాటు చేసి వేలం వేయడం అక్కడ ఆనవాయితీగా మారింది. 


దీంతో భోలక్‌పూర్ డివిజన్ గణేశ్ మండపం దగ్గర నిన్న (బుధవారం) నాడు నిర్వహించిన లడ్డు వేలం పోటాపోటీగా మారింది. భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు 5 లక్షల రూపాయల విలువ చేసే 123 గ్రాముల అంటే 10తులాల బంగారు లడ్డును 5 వేల ఒక్క రూపాయితో వేలం పాటను ప్రారంభించి చివరకు 7 లక్షల 56 వేల ధర పలికి చేపల వ్యాపారి భైరి విష్ణు ప్రసాద్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: