ఏపీలో వైసీపీ ప్రభుతం ఏర్పడి వంద రోజులు కావస్తోంది. అప్పటి నుంచీ అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికల మీదే ఉంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీడీపీ సైతం 'స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు.. ఈ ప్రభుత్వం ఎన్నికల కోసం భయపడుతోంది' అనే విమర్శలు కూడా చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలోనే దీనిపై ఓ ప్రకటన చేశారు. ఇప్పుడు వీటిపై ఓ స్పష్టత వచ్చిందని అంటున్నారు.

 

 

 

వచ్చే డిసెంబర్ లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయాత్తమవుతోందని సమాచారం. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ సూచనప్రాయంగా స్పష్టత ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విషయంలో నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. త్వరలోనే మున్సిపల్, కార్పొరేషన్ల పెండింగ్ బిల్లుల క్లియర్ చేయాలని కూడా భవిస్తోందట. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ కమిషనర్ల వర్క్ షాప్ లో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన పై వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. అయితే.. ఇంతవరకూ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. మున్సిపల్ ఎన్నికల కోసం ఇటు వైసీపీ పక్కా ప్రణాళికతో వెళ్లాలని చూస్తోంది. పురపాలికలపై వైసీపీ జెండా ఎగరేయాలని భావిస్తోంది. టీడీపీ కూడా మున్సిపల్ ఎన్నికల కోసమే చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఈ ఎన్నికల్లో బదులు తీర్చుకోవాలని చూస్తోంది.

 

 

 

ప్రస్తుతానికైతే మున్సిపల్ ఎన్నికల కోసం ఆ శాఖ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: