ఆంధ్రప్రదేశ్ వైసిపి మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు నాయుడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అనవసరంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నాడు అని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో తెలుగు దేశం పార్టీ నేతలపై దాడులు భారీగా జరిగాయి అని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు ఓ కార్యక్రమాన్ని చేపట్టారు.        


ఆ కార్యక్రమమే 'ఛలో ఆత్మకూరు'. అత్యంత దారుణంగా ఆ కార్యక్రమం విఫలమైయ్యింది. చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ ని ఆంధ్ర ప్రదేశ్ లో గందరగోళం సృష్టించే టీడీపీ నేతలను ప్రతి ఒక్కరిని గృహ నిర్బంధంలో బంధించారు. కారణం పెయిడ్ ఆర్టిస్టులతో కలిసి పల్నాడులో ఉద్రిక్త సృష్టించేందుకు ప్రయత్నించాడు చంద్రబాబు. అయితే ఆలా జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు.          

           

ఆలా అడ్డుకున్న దళిత మహిళా పోలీసులను తీవ్రంగా దూషించారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో వివాదాలు సృష్టిస్తున్నాడు అని, అసలు ఏమి జరగకపోయినా రెచ్చిపోతున్నారాని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.                 


ఈరోజు మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ 'పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ రాజకీయం చేస్తుందని, రాజకీయ నిరుద్యోగం వల్లే చంద్రబాబు ఇదంతా చేస్తున్నాడని, చిన్న వివాదాన్ని కూడా చంద్రబాబు పెద్దది చేసి చూపించి ప్రజలను అయోమయ స్థితిలోకి దించుతున్నాడని, చంద్రబాబు హయాంలోనే ఎన్నో అరాచకాలు జరిగాయని బొత్స వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.       


మరింత సమాచారం తెలుసుకోండి: