కూతురు తప్పుచేస్తే మందలించవలసిన తల్లి,తాను చేసే తప్పులో కూతురును పావుగా వాడుకోవాలని చూసింది.తనతో అక్రమ సంబంధాన్ని కలిగి వున్న యువకుడు వేరే పెళ్ళిచేసుకుని ఎక్కడ తనను దూరంగా పెడతాడో అనే భయంతో ఓ మంచి స్క్రీన్‌ప్లేకి ఊపిరి పోసింది.దానిలో తన కూతురును మేయిన్ రోల్‌గా వాడుకుని ఆ యువకుని వివాహన్ని పెటాకులు చేద్దామని అడుగేసిన ఆమె చివరకు ఆ ఉచ్చులోనే చిక్కుకుంది.ఈ సంఘటన చూస్తే సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపడక తప్పదు..ఇంతకు ఈ అద్భుతమైన సినిమా నడించింది ఎక్కడో ఇప్పుడు చూద్దాం..



ఎవరైన తన కూతురూ వేరే వాడితో ప్రేమ కలాపాలు సాగిస్తుందని తెలిస్తే అంతెత్తు ఎగిరి కొట్టినంత పని చేస్తారు,కాని ఈ తల్లి తన కూతురూ చెప్పిన మాట విని ఆ కుర్రాడితో పెళ్లికి ఒప్పుకుంది.అలాగని ఈమె చాల మంచి అమ్మ అనుకునేరు.డెరెక్షన్ లో పూరి జగన్నాద్ లాంటి ఎందరినో మించింది.ఆ వివాహంలో గొడవ జరగడం ఆక్కడికి పోలీసులు రావడం అసలు విషయం తెలుసుకుని పోలీసులు షాక్ అవ్వడం జరిగింది.ఇంతకు ఈ ఘటన జరిగింది తమిళనాడులోని తంజావూరు జిల్లా  తిరువయ్యూరు ఊరిలో.ఇక ఈ సంఘటన తాలుకు విషయం అక్కడ కలకలం రేపింది.ఎస్పీ కార్యాలయానికి 19 సంవత్సరాల ఓ యువతి హడావుడిగా వచ్చి,తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి,తనను ప్రేమించి మోసం చేశాడని,ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని ఫిర్యాదు చేసింది.ఆ పెళ్లిని అడ్డుకుని, తనకు న్యాయం జరిపించాలని వేడుకోగా,ఈ ఫిర్యాదును తిరువయ్యూరు మహిళా పోలీస్ స్టేషన్ కు ఎస్పీ ఫార్వార్డ్ చేశారు.



వెంటనే మహిళా పోలీసులు అతని పెళ్లి జరుగుతున్న ప్రదేశానికి యువతితో పాటు ఆమె తల్లిని కూడా తీసుకెళ్లి విచారిస్తుండగా కల్యాణ మండపం దగ్గరకు వెళ్లిన అమ్మాయి ఆ యువకుడితోనే తన పెళ్లి జరిపించాల్సిందేనంటూ,ఒంటిపై కిరోసిన్ పోసుకుని అత్మహత్య ప్రయత్నం చేసింది.ఆమెను బలవంతంగా అడ్డుకున్నపోలీసులు,మందలించి,పెళ్లి కొడుకుని గట్టిగా ప్రశ్నించారు.అప్పుడు అసలు ఊసరవెళ్లి రంగులు బయట పడ్డాయి.తాను ఆ యువతిని ప్రేమించలేదని,కానీ,ఆమె తల్లితో తనకు అక్రమ సంబంధం ఉందని అతను చెప్పడంతో పోలీసు దిగ్భ్రాంతికి గురయ్యారు.ఆపై యువతి తల్లిని నిలదీయగా,నిజాన్ని  ఒప్పుకుంది.తన కుమార్తెతో అతనికి వివాహం జరిపిస్తే,తన సుఖానికి లోటు ఉండదన్న ఆలోచనతోనే పెళ్లికి ఒప్పుకున్నట్టు చెప్పింది.దీంతో అసలు విషయం గ్రహించిన యువతి,తన ఫిర్యాదును వెనక్కు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోగా,మహిళా పోలీసులు ఆమె తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.దీంతో ఆ యువకుడి పెళ్లి యధావిధిగా జరిగింది.చూసారుగా ఏ డైరెక్టరుకు రాని ఆలోచన ఈమెకు వచ్చింది కాని ఈమె తీసిన సినిమా చివరకు ఫ్లాప్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: