చంద్రబాబునాయుడుకు గ్లోబల్ అంటే ఎంతో  భక్తి, నమ్మకం. ఆయన ఏదైనా ఒకసారి చెప్పరు, పదే పదే చెబుతూంటారు.  అవతల వారు విని విని విసుగు చెందాలే కానీ బాబులో విసుగు మచ్చుకైనా కనిపించదు. ఆయన రాజకీయం అంతా అలాగే సాగింది. ఎన్టీయార్ నుంచి అధికారం లాక్కున్నపుడు లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించారు. అదే పనిగా అనుకూల మీడైయా కధనాలు వండివార్చింది. మొదట్లో నమ్మని వారు, వదినా వదినా అని వెంటబడిన వారు చివరికి లక్షీపార్వతిని బాబు ఆయన అనుకూల మీడియా ఆలోచించినట్లుగానే ఆలోచించారు. దాంతో పని సులువైంది. అన్న గారి అధికారం అల్లుడి గారి పరమైంది.


ఇక వైఎస్సార్ మీద జగన్ చాలా ఆరోపణలు చేశారు. ఫ్రాక్షన్ ముద్ర వేశారు. ఆయన్ని ముఠా నాయకుడు అన్నారు. కానీ జనం నమ్మలేదు, వైఎస్ ని సీఎం గా రెండుమార్లు చేశారు. అయినా బాబు మాత్రం వైఎస్ ఫ్యామిలీ మీద అదే బురద జల్లుతూనే ఉన్నారు. ఇక జగన్ మీద బాబు చేసిన విష ప్రచారం లెక్కే లేదు. లక్ష కోట్ల ఆరోపణ వెనక ఉన్న అసలు కధను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రులు మైసూరా రెడ్డి, దాడి వీరభద్రరావులు ఎపుడో చెప్పారు. భారీగా ఉండాలని లక్ష కోట్ల నంబర్ వేశామని గుట్టు విప్పారు. ఇలా ఉంటాయి బాబు మార్క్ ఆరోపణలు.


ఇదిలా ఉండగా జగన్ ఇపుడు సీఎం అయ్యారు. ఆయన మీద చంద్రబాబు ఫ్రాక్షన్ ముద్ర వేస్తున్నారు. మూడు నెలల్లోనే ఏదో జరిగిపోతున్నట్లుగా హడావుడి చేసిన బాబు చలో ఆత్మకూర్ అన్నారు, దాన్ని వైసీపీ సర్కార్ బాగానే ఎదుర్కొంది. అయితే  అనుకూల మీడియా మాత్రం ఉక్కుపాదంతో అణిచేసారని రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా ఇపుడు  చలో అత్మకూర్  అయిపోయింది. దాంతో బాబు కొత్త ప్లాన్ వేస్తున్నారు.


త్వరలో గవర్నర్ ని కలసి  జగన్ మూడు నెలల పాలనపై వేసిన పుస్తకాలను ఇస్తారట. అలాగే, ఏపీలో జగన్ ఫ్రాక్షన్ కల్చర్ ని ప్రవేశపెడుతున్నారని చెప్పుకొస్తారట. ఏపీలో శాంతిభద్రతలు లేవన్న దాన్ని చెబుతారట. అంటే ఎలాగైనా జగన్ మీద ఫ్రాక్షన్ ముద్ర వేయాలని, జనాల్లో జగన్ మీద భయం పుట్టించాలని, వ్యతిరేకత పెంచి పోషించాలని  బాబు విశ్వప్రయత్నం చేస్తున్నట్లుగా అర్ధమవుతోంది. మరి దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: