ఈ మధ్యకాలంలో జరిమానాలు పేరు బాగా వింటున్నాం. గత 12 రోజుల నుంచి అయితే మరి మరి జరిమానాల పేరు వింటున్నాం. కారణం ఈ 12 రోజుల్లో కొత్త ట్రాఫిక్ రూల్స్ తో మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రూల్స్ పాటించకపోతే ఒకొక్కరికి ఒకో రేటుతో భారీ జరిమానాలు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ లేదనో, రూల్స్ పాటించలేదనో ప్రజలకు జరిమానాలు విధిస్తున్నారు అంటే సరే మరి మేకకి ఎందుకు ?                              


మేక ఏం తప్పు చేసిందని మేకకి జరిమానా విధించారు చెప్పండి ? అని అందరి మనసులో ఓ ప్రశ్న తలెత్తుంది. అయితే మేక కూడా ఒక తప్పు చేసింది. ఆ తప్పు ఏంటంటే 'ఆ మేకకు ఆకలి వేసింది ఆకులను తినింది' అందుకే 10,000 జరిమానా. ఏంటి అని ప్రశ్న వెయ్యకండి.. ఆ మేక తినింది మాములు చెట్ల ఆకులు కాదు హరితహారం చెట్ల ఆకులను తినింది.                            


ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలో బుధవారం జరిగింది. ఉప్పర్‌ పల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు తిన్నాయి. సరిగ్గా అదే సమయంలో గ్రామ పర్యటనకు వచ్చిన కలెక్టర్ మేకలు మొక్కలను తినడాన్ని చూసి, యజమానికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎంపీడీవో ఒకేసారి ఆ మేకల యజమానికి 10వేల రూపాయిలు జరిమానా విధించారు. కాగా ఎంపిడివో వివరణ ఇస్తూ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే జరిమానా విధించినట్లు తెలిపారు.         


మరింత సమాచారం తెలుసుకోండి: