పొరుగుదేశ‌మైన చైనా....రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తోంది. మరోసారి భారత ఆర్మీని చైనా  రెచ్చగొట్టేలా వ్యవహరించింది. దీంతో సరిహద్దులో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఇరువర్గాల సైనికులు ఒకరినినొకరు తోసుకున్నారు. అంతలోనే ఉన్నతాధికారులు స్పందించడంతో ఈ ఘర్షణాత్మక వాతావరణం కాస్తా సద్దుమణిగింది. ఈ ఘటన కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో చోటుచేసుకుంది.


లడఖ్, టిబెట్ మధ్య ఉన్న పాంగాంగ్ సరస్సు తమదంటే, తమదని భారత్, చైనా దేశాలు పట్టుబడుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరైన సరిహద్దు లేకపోవడం, ప్రస్తుతం ఉన్న వాస్తవాధీన రేఖ(LOC) ను చైనా గుర్తించక పోవడంతో భారత్, చైనా సైన్యాల మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, లడఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. త్వరలోనే ఇక్కడ భారత ఆర్మీ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే భారత ఆర్మీ పెట్రోలింగ్ పట్ల చైనా సైనికులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. భారత్, చైనా సైనికులు ఈ సందర్భంగా ఒకరినొకరు తోసుకున్నారు. అయితే ఇరుదేశాలకు సంబంధించి బ్రిగేడియర్ స్థాయి ఆర్మీ ఉన్నతాధికారులు ఈ విషయమై చర్చలు జరపడంతో సమస్య ఒక్కరోజులోనే పరిష్కారమైంది.


మోడీ ఫస్ట్‌ టర్మ్‌‌‌‌లో చైనాతో సంబంధాలు అంత సజావుగా లేకపోయినా.. చివర్లో కొంత సానుకూలత ఏర్పడింది. సెంట్రల్‌‌‌‌ చైనాలోని వుహాన్‌‌‌‌లో మోడీ–జిన్‌‌‌‌పింగ్‌‌‌‌  ఒన్‌‌‌‌–టు–ఒన్‌‌‌‌ భేటీ జరుపుకున్నారు. మోడీ 2.0 వెర్షన్‌‌‌‌లో జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ వారణాసికి వచ్చే సూచనలున్నాయి. చైనాకి గల అనుమానాలను పటాపంచలు చేయడం మోడీ బాధ్యత కాగా,ఇండియాతో ఇన్వెస్ట్‌ మెంట్‌‌‌‌ ఫ్రెండ్లీ గా మారడం జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ కర్తవ్యం. ఇండియాకి మోడీ రెండోసారి ప్రధాని అవుతారని చైనా ముందే ఊహించింది. కాకపోతే బీజేపీకి లోక్​సభలో ఇంత భారీ మెజారిటీ వస్తుందని అంచనా వేయలేకపోయింది. కమల దళానికి బొటాబొటీ ఆధిక్యతే వస్తుందని, కొయిలేషన్​ గవర్నమెంట్​ ఏర్పడక తప్పదని డ్రాగన్​ భావించింది. సంకీర్ణ సర్కారు వల్ల కీలక నిర్ణయాల సమయంలో ప్రధాని మోడీ ‘ఫ్రీ హ్యాండ్​’ తీసుకోలేరని అనుకుంది. విదేశీ విధానాల అమల్లోనూ ఫస్ట్​ టర్మ్​ మాదిరి కఠినంగా వ్యవహరించలేరనే అభిప్రాయానికి వచ్చేసింది. ఇండియా ప్రెస్​ రిపోర్ట్​లు, ఇండియన్​ విజిటర్లతో జరిపిన ముచ్చట్లు ఆధారంగా మోడీని లైట్​ తీసుకున్న చైనా.. ఎన్నికల ఫలితాలతో షాక్​కి గురైంది. చైనా అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన విజయం సాధించి రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో చైనా మోడీ 2.0 వెర్షన్​ నుంచి ఏం ఆశిస్తోందనేది ఆసక్తికరమైన అంశమే. విదేశాలను, ప్రధానంగా తమను ఎలా డీల్​ చేస్తారోనని చైనా వేచి​ చూస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: