టాలీవుడ్ లో తమ యాటిట్యూడ్ అనగా తమదైన వైఖరితో అనేకమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న వారి వరుసలో పవన్ కళ్యాణ్ మరియు విజయ్ దేవరకొండ ముందు నిలుస్తారు. పవన్ తో పోలిస్తే దేవరకొండ పిల్లోడే కానీ తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక వెలుగు వెలుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆసరాగా ముందుండి సాయం చేయడంలో అస్సలు వెనక్కి తగ్గడు. ఇక విజయ్ దేవరకొండ అయితే తనకు ఏదైనా ఒక విషయం నచ్చకపోతే నేరుగా మొహం మీదే  చెప్పేస్తాడు. ఇలా వీరిద్దరూ కలిసి ఒకే విషయం పైన స్పందిస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకొండి.

గత కొద్ది రోజులుగా చాలామంది సామాజిక కార్యకర్తలు నల్లమల అడవులు ఉన్న ప్రాంతంలో యురేనియం మైనింగ్ జరగకూడదని ఎన్నో ధర్నాలు మరియు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలుస్తూ  ట్వీట్ కూడా వేశాడు. "భావితరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా? యూనియన్ కాలుష్యం తెలంగాణ ఇస్తామా? అన్నది అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు ఆలోచించాలి" అన్నాడు పవన్. ఏకంగా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే చాలామంది ప్రతిపక్ష నాయకులు ధర్నా లు కూడా మొదలు పెట్టేసారు. అక్కడ తన పార్టీ ఉనికి ఇసుకంత లేకపోయినా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు తాను మద్దతుగా నిలుస్తాను అంటూ ప్రకటించాడు..

ఇలాంటి ఒక సెన్సిటివ్ విషయంపై మరో హీరో ధైర్యం చేయకపోగా.... మన విజయ్ దేవరకొండ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా తన నోటిని విప్పాడు. "మనం ఇప్పటికే చెరువులని, గాలిని, ఆఖరికి తాగే నీటిని కూడా కలుషితం చేసుకొని బ్రతుకుతున్నాం. మనకి మిగిలి ఉన్న అతి కొద్ది దాన్ని కూడా నాశనం చేసుకుంటే భావితరాలు ఎలా బతుకుతాయి. నీకు యురేనియం కావాలనుకుంటే కొనుక్కోవచ్చు కానీ అడవులు కావాలనుకుంటే కొనుక్కోగలవా" అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు. త్రాగడానికి నీరు, పీల్చడానికి గాలి లేనప్పడు ఈ యురేనియం మరియు కరెంటు ఏమి అవసరం అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తాడు.

ఇతని మొండి ధైర్యం చూసి అటు తెలంగాణ ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా అతనిపై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే నల్లమల అడవుల్లో యురేనియం వంటి ప్రమాదకరమైన న్యూక్లియర్ పదార్థం వెలికి తీయడం వల్ల కొన్ని వేల మంది నిరాశ్రయులు కానుండగా… అక్కడి గాలి, నేల, నీరు కలుషితమైపోయి కొన్ని వందల ఎకరాల అడవులు పూర్తిగా నాశనం కావడంతో పాటు పలు రకాల క్యాన్సర్ వ్యాధులు కూడా సోకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎప్పుడు వీరిరువురిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వంపై ఇంకా ఎంత మంది సెలబ్రిటీలు ఒత్తిడి తీసుకువస్తారో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: