ఎప్పుడైతే కొత్త రవాణ చట్టం అమల్లోకి వచ్చిందో అప్పడి నుండి ప్రతి వాహనదారులనికి రోడ్డు పైన ట్రాఫిక్ పోలీసులు రంగు రంగుల బొమ్మలను చూపిస్తూ రంకెలేపిస్తున్నారు. తాగితే ఎక్కే కిక్కు కంటే చలానాలను చూస్తే వచ్చే కిక్కు మజానే వేరుగా వుంటుంది.దీనివల్ల ఇప్పటికే రోడ్డు పైకి రావడానికి సగం జనాభా భయపడుతుండగా,మిగతావారు వాహనాలను దాదాపుగా తీయకుండా బస్సులకు వెళ్లుతున్నారు.అన్నిపత్రాలు పక్కాగా వున్నవారు మాత్రమే జంకు లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఇదిలా వుండగా ఈ కొత్తచట్టం పై ఇప్పటికే నిరసనలు ప్రకటిస్తున్న వాహనదారులు వారి బాధను పలురకాలైన రీతిలో ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.



తాజాగా కేంద్రం కూడా కొంత వెసులుబాటు కల్పించింది.ఇక మన దేశ రాజధాని ఐనా ఢిల్లీలో ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది.మీరుఎన్ని చట్టాలుతెచ్చిన మా పని మేం చేసుకుంటామన్న రీతిలో ఓ డ్రైవర్ ప్రవర్తించి అడ్డంగా బుక్కైయ్యాడు. విషయంలోకి వెళ్లితే.ఢిల్లీలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు ట్రాఫిక్‌ పోలీసులు విధించిన జరిమానా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఓ పదో పరకో కాదు ఏకంగా రెండు లక్షల రూపాయలు.ఎన్ని నెలలు కష్టపడితే అతను అంత సంపాదిస్తాడో తెలియదు గాని కేంద్ర ఖజాన మాత్రం బాగా నిండుకుంటుంది.ఇక ముబారక్‌ చౌక్‌ సమీపంలో అధిక లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు గుర్తించిన పోలీసులు డ్రైవర్‌కు రూ.2లక్షలు చలాన్ రాసారు.



ఈ జరిమానాల విషయంపై కేంద్రంలోనిపెద్ద,రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ మాట్లాడుతూ,ప్రమాదాలు నివారించడానికే అధిక జరిమానాలు విధిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ప్రజలుమాత్రం నూతన రవాణా చట్టం మీద గుర్రుగా వున్నారు ఇందుకు కారణం వారు విధంచే జరిమానాలు పెద్ద మొత్తంలో ఉండటమే.ఇక ఢిల్లీలోని ముకర్బా ప్రాంతంలో చోటుచేసుకున్న తాజా ఘటన ఇప్పటి వరకు నమోదైనటువంటి జరిమానాల రికార్డు తిరగరాసింది.ఓ ట్రక్కు డ్రైవర్‌కు నియమాలు ఉల్లంఘించినందుకు గాను రూ.2 లక్షలకు పైగా జరిమానా విధించారు.ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు డ్రైవర్‌ రామ్‌ కిషన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి,నూతన చట్టం ప్రకారం ఓవర్‌ లోడ్‌ కారణంగా సదరు ట్రక్కు డ్రైవర్‌ 2 లక్షల 500 రూపాయాలను జరిమానాగా విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: