తెలుగు రాష్ట్రాల్లోని మీడియా రంగంలో  చాలా కాలం క్రితమే అనారోగ్య పోటి మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని చాలా చోట్ల ఏబిఎన్ ప్రసారాలు నిలిచిపోయాయట. దానికి కారణం ప్రభుత్వమే అని యాజమాన్యం ఆరోపిస్తు తమ దినపత్రిక మొదటిపేజిలో బ్యానర్ కథనాన్నే ఇచ్చింది.  అధికారంలో ఉన్న పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉండే మీడియా యాజమాన్యాలు తమ స్వలాభం కోసం ప్రత్యర్ధి మీడియా యాజమాన్యాలను ఎన్ని ఇబ్బందులకు గురిచేయటానికైనా వెనకాడటం లేదు.

 

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏబిఎన్–ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై ఇటువంటి ఆరోపణలు చాలా ఉండేవి. చంద్రబాబు-రాధాకృష్ణకు మధ్య ఉన్న సంబంధాల గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఆ సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా లాభపడ్డారనే ఆరోపణలున్నాయి. తాను లాభపడటం ఒక ఎత్తు. తాను లాభపడటం కోసం ప్రత్యర్ధి మీడియా సంస్ధలను తొక్కేయటం మరో ఎత్తు.

 

చంద్రబాబు హయాంలో సాక్షి టివి ప్రసారాలను అడ్డుకోవటం, సాక్షి దినపత్రిక పంపిణికి ఇబ్బందులు సృష్టించటం లాంటివి చాలానే జరిగాయి. దీనంతటికి వెనుక రాధాకృష్ణ హస్తముందనే ఆరోపణలు అప్పట్లో బాగా వినబడ్డాయి. నిజానికి టిడిపి అధికారంలో ఉన్నపుడు సాక్షి మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా(వాస్తవాలు)చాలా కథనాలే వచ్చాయనటంలో సందేహం లేదు. అప్పట్లో చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా అవేవీ ఏబిఎన్-ఆంధ్రజ్యోతిలో కనబడేవి కావు.

 

మూడు నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి సిఎం అయిన దగ్గర నుండి రాధాకృష్ణకు సమస్యలు మొదలయ్యాయి. అదే సమయంలో చంద్రబాబు హయాంలో ఏబిఎన్-ఆంధ్రజ్యోతి వెలిగినట్లు ఇపుడు సాక్షి మీడియా అంతస్ధాయిలో  వెలగటం లేదు. అయితే చాలా ప్రాంతాల్లో ఏబిఎన్ ప్రసారాలను ప్రభుత్వం నిలిపివేయించిందట. ఈ మేరకు మొదటి పేజిలో పెద్ద కథనాన్నే ఇచ్చింది.

 

ఎంఎస్వోలపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలను అడ్డుకున్నట్లు చెప్పింది. పనిలో పనిగా మీడియా స్వేచ్చపై నీతులు కూడా చెప్పింది లేండి. ఇపుడు చెప్పిన నీతులు గతంలో ఎందుకు గుర్తుకు రాలేదో. అదేమంటే అప్పట్లో సాక్షి ప్రసారాలను అడ్డుకోవటానికి తనకు ఏమి సంబంధమని బుకాయించ వచ్చు. కానీ సహచర మీడియా ప్రసారాలను అప్పట్లో టిడిపి నిలిపివేయటం తప్పని ఎందుకు బహిరంగంగా ప్రశ్నించలేదన్నదే అసలైన ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: