ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని తపిస్తున్న జగన్.. తన పాలనపై తానే సర్వేలు చేయించుకుంటున్నారు.. ఏ ఏ అంశాలపై జనం స్పందన ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ సర్వేలు చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇటీవల ఓ సమీక్ష సమావేశంలో బయటపెట్టారు.


తన సర్వే ఫలితాలను అధికారులకు వివరిస్తూ... తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఇంతకీ జగన్ సర్వే చేయించింది ఏ విషయం మీద.. ఆ సర్వేలో ఏం తేలింది.. ఆయన స్పందన కార్యక్రమంపై సర్వే చేయించుకున్నారట. అయితే ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు జగన్ కు సంతృప్తి కరంగా అనిపంచలేదట. ‘స్పందన’ కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించుకున్న వారిలో 59 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారట.


మిగిలిన 41 శాతం మంది మరింత మెరుగ్గా సమస్యలను పరిష్కరించవచ్చనే అప్రాయాన్ని వ్యక్తం చేశారట. అయితే ఈ సర్వేలో రాండమ్‌గా కాల్‌ చేసి అభిప్రాయాలు స్వీకరించారట. ఈ సర్వే ఫలితాలు ఆయా జిల్లాలకు చెందిన అధికారులకు చూపించి మెరుగుపరుచుకోవాల్సిందిగా చెబుతామని జగన్ అంటున్నారు.


అధికారుల పని తీరు పట్ల జనం ఏ తరహా సమాధానాలు ఇచ్చారో చూపించేందుకు వర్క్‌షాపు నిర్వహిస్తారట. ఎమ్మార్వో, ఎంపీడీఓ, మున్సిపల్‌ కమిషనర్లు, కలెక్టర్లు.. అందర్నీ పిలిపించి ఈ తరహా ప్రక్రియ చేపడతారట. అధికారులు ప్రజల సమస్యలను మానవత్వం పరిశీలించాలని.. అధికారుల ప్రతి చర్యలో, ప్రతి అక్షరంలో మానవత్వం కనిపించాలని జగన్ అధికారులకు సూచిస్తున్నారు.


అయితే ఇక్కడ జగన్ గమనించాల్సింది ఒకటుంది. గతంలో చంద్రబాబు కూడా ఇలాగే సర్వేలుప చేయించేవారు. అందుకోసం ఆర్జీజీఎస్ వ్యవస్థను వాడుకున్నారు. వారు ప్రతి సర్వేలోనూ 90 శాతం సంతృప్తి,.. 80 శాతం సంతృప్తి అంటూ చంద్రబాబుకు లెక్కలు చెప్పేవారు. చంద్రబాబు ఆహా.. ఓహో.. నా పాలన అద్భుతం అనుకునేవారు. జగన్ కూడా అలా బోల్తా కొట్టకుండా జాగ్రత్త పడితే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: