వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ చంద్రబాబు నాయుడు సినిమా అట్టర్ ప్లాప్ అని అన్నారు. ట్విట్టర్ లో రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి ఈరోజు స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసిన ఛలో ఆత్మకూరు సినిమా అట్టర్ ప్లాప్ అయ్యిందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

గతంలోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బియోపిక్స్ అని 'ఎన్టీఆర్-కధానాయకుడు, మహానాయకుడు' పేర్లతో రెండు చెత్త సినిమాలు తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయిని. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు 'ఛలో ఆత్మకూర్' అనే చెత్త సినిమాను వదిలాడు. సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు దూసుకు పోతుంటే ఏడుపుగొండి చర్యలతో ఈయన మరింత పతనమవుతున్నాడు.'' అని చంద్రబాబు నాయుడుని ట్యాగ్ చేశారు విజయ సాయి రెడ్డి.  


ఈ ట్విట్ పై నెటిజన్లు స్పందిస్తూ చంద్రబాబుపై మండిపడుతున్నారు.. ఇంకా సినిమాలు తియ్యకు చంద్రయ్య చూడలేక పోతున్నాము ప్లీజ్ అని ఒకరు ట్విట్ చేస్తే మరికొందరు స్పందిస్తూ నీ సినిమా తీసుకో చంద్రం.. ఎందుకు ఊరికే ఇలాంటి చెత్త సినిమాలు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. మరి విజయసాయి రెడ్డి పెట్టిన ట్విట్లను చూసి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: