విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యునిగా మరియు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. రాజ్యసభ సభ్యునిగా ఉన్నవారు లాభదాయక పదవుల్లో ఉండరాదని నిబంధనలు ఉన్నాయి. ఈ విషయంపై గత కొన్ని రోజులనుండి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అందువలన నిబంధనలను అనుసరించి జీతం లేకుండా విజయసాయిరెడ్డికి ఏపీ ప్రభుత్వం హోదాను ఇచ్చింది. 
 
రాష్ట్రపతికి కూడా ఈ విషయం గురించి టీడీపీ పార్టీ ఫిర్యాదు చేసింది. అందువలన ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉత్తర్వులను సరి చేసింది. జీతం ఇవ్వకుండా కేవలం హోదాను మాత్రమే ఇచ్చేలా విజయసాయిరెడ్డికి జీతంలో కోత పెట్టింది. గతంలో కూడా ఇలా రెండు పదవుల విషయంలో సోనియా గాంధీ మీద విమర్శలు రావటం జరిగింది. టీఆర్ ఎస్ పార్టీలో కూడా శాసనసభ కార్యదర్శికి సంబంధించి ఇలాంటి వివాదాలు వచ్చాయి. 
 
ప్రభుత్వం విజయసాయిరెడ్డికి జీతం ఇవ్వకపోవటం అనే నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి ఉపయోగపడే నిర్ణయమే అయినప్పటికీ ప్రజలు నాయకుల్ని కేవలం జీతాల మీద ఆధారపడి జీవిస్తున్నారని అనుకోరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పదవిలో ఉండటం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా ఉండటంతో పాటు కొన్ని కేంద్ర పథకాల విషయంలో ధరఖాస్తు చేసుకోవటానికి ఉపయోగపడే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయసాయిరెడ్డికి అన్ని విషయాలపై అవగాహన ఉంటుంది కాబట్టి కేంద్రం నుండి నిధుల్ని రాష్ట్రానికి తేలికగా తీసుకొనివచ్చే అవకాశం ఉంది. 
 
ఈ పదవి వలన ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు, ప్రాంతాలకు ఈ ప్రతినిధులు నిధులను ఎక్కువగా తీసుకొనిరావటానికి అవకాశం ఉంటుందని తెలుస్తుంది. కేంద్రం నుండి న్యాయబధ్ధంగా నిధులను తీసుకొనిరావటానికి ఈ పదవి ఉపయోగపడుతుందని తెలుస్తోంది. కేంద్రం మరియు రాష్ట్రం మధ్య సత్సంబంధాల విషయంలోను మరియు నిధుల విషయంలోను విజయసాయిరెడ్డి వలనే అవుతుందని మరియు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: