టీడీపీ నేత,మాజీ ఎమ్మెల్యే,చింతమనేని ప్రభాకర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.2017లో దళిత యువకులపై దాడి,కులంపేరుతో దూషించిన కేసుల కారణంగా చింతమనేని గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు.ఆ సమయంలో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని,ఆయన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి వచ్చిన విషయం తెలుసుకున్నపోలీసులు ఆయనను అరెస్ట్ చేసి,ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఆయన అరెస్ట్ కావడానికి ముందు ప్రభాకర్ కోసం 14 పోలీస్ బృందాలు పశ్చిమగోదావరి జిల్లాను జల్లెడపట్టడమే కాకుండా,తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించారు.అయినా చింతలేకుండ వున్న చింతమనేనిని పట్తుకోవడం వారికి అసాధ్యమైంది.



ఈ దశలో తనంత తాను కన్నంలోనుండి ఎలుకలా బయటకు రావడం.సడన్‌గా తన స్వగ్రామం దుగ్గిరాలలో ప్రత్యక్షంకావడంతో,అతని కోసం వెతికి వెతికి వున్న పోలీసులకు ఆయనే స్వయంగా కనబడటం,ప్రసాదం దొరికినట్లుగా ఆనందపడుతూ వెంటనే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా చింతమనేని వారికి చుక్కలు చూపించారు.చిన్న పిల్లాడిలా కారు దిగనంటే దిగనని మారాం చేస్తూ హైడ్రామా సృష్టించారు.అదే సమయంలో ఈ విషయం తెలుసుకున్న చింతమనేని అనుచరులు,టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.దాంతో అనుచరులను,కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు,చింతమనేనిని బలవంతంగా జీపులో ఎక్కించి ఏలూరు తరలించి,ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు.



ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తనపై కక్షగట్టిందని,అందుకే అక్రమ కేసులు పెట్టి తనను అంతమొందించేందుకు,కుట్ర చేస్తున్నారంటు ఆరోపించారు.ఇదిలాఉంటే,తమకు న్యాయం చేయాలంటూ,చింతమనేని బాధితులు.పోలీస్‌స్టేషన్ ముందు క్యూకట్టి,తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీకి పెద్దఎత్తున ఫిర్యాదులు ఇస్తున్నారు..ఇక దళిత యువకులపై దాడి,కులం పేరుతో దూషించడం వంటి ఘటనలో అట్రాసిటీ సెక్షన్‌తో పాటు 143,341,324,323,506,148 రెడ్ విత్ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేసి కోర్టులో హజరు పరచగా ఏలూరు కోర్టు ప్రభాకర్‌కు సెప్టెంబర్ 25 వరకు రిమాండ్ విధించడంతో ఏలూరు సబ్ జైలుకు తరలించారు.ఇక చింతమనేని ఖాతాలో అట్రాసిటీ,భూకబ్జా,బెదిరింపులు ఇలా 60కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.మరోవైపు,చింతమనేని అరెస్ట్‌‌తో,ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్త కుండా,పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: