నల్గొండలో టీడీపీ పార్టీ నేతలు బాహాబాహీకి దిగారు. నల్గొండలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో ఈ ఘటన జరిగింది. బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైన నేతలు కూడా ఈ సమావేశానికి రావటంతో తెలుగు తమ్ముళ్లు సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేయటం జరిగింది. తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేయటంతో రెండు వర్గాల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. 
 
కొంత సమయం తరువాత ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య చాలా సమయం పాటు తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి టీడీపీ పార్టీ నేతలు ఎవరూ హాజరు కాలేదని తెలుస్తుంది. కేవలం జిల్లా స్థాయి నేతలు మాత్రమే ఈ సమావేశానికి హాజరు అయ్యారని సమాచారం. ఈ సమావేశంలో కొందరు కార్యకర్తలు నేతల వ్యవహారశైలిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసారని తెలుస్తోంది. 
 
కిరణ్మయి, వాసుదేవరావు అనే ఇద్దరు నేతలు బీజేపీ పార్టీలోకి వెళ్ళేందుకు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లటంతో పాటు బీజేపీ నేతలతో మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు వీరిద్దరూ పార్టీ మారే విషయం గురించి స్పష్టమైన నిర్ణయం మాత్రం తీసుకోలేదని సమాచారం. వీరిద్దరూ టీడీపీ పార్టీలోనే కొనసాగుతూ ఈరోజు జరిగిన సమావేశానికి హాజరయ్యారు. 
 
వీరు ఈ సమావేశానికి రావటమే కాక వేదికపైన కూర్చోవటంతో తెలుగు తమ్ముళ్లు కొందరు అసంతృప్తి వ్యక్తం చేయటం జరిగింది. బీజేపీ పార్టీలోకి వెళ్ళాలనుకునే నేతలు పార్టీ వేదికపైన కూర్చోవద్దని తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేయటం జరిగింది. తెలుగు తమ్ముళ్ల నినాదాలతో రెండు వర్గాల మధ్య గొడవలు మొదలయినట్లు తెలుస్తుంది. కొంత సమయం తరువాత మిగతా వర్గాలు ఇరు వర్గాల్ని శాంతింపజేశారని తెలుస్తుంది. ఇంకా పార్టీ మారే విషయంపై స్పష్టత లేకపోవటంతో వీరిద్దరూ సమావేశానికి హాజరయ్యారని సమాచారం. 




మరింత సమాచారం తెలుసుకోండి: