వైసీపీ ప్రభుత్వం మరోసారి పదవుల పండుగ చేపట్టింది. ఈ సారి శ్రీవారి సేవ చేసుకునే టీటీడీ బోర్డు సభ్యులని నియమించే ప్రక్రియ. మునుపు ఎన్నడూ లేని విధంగా బోర్డులో ఈసారి ఎక్కువ మెంబర్స్ ఉండనున్నారు. తమకు శ్రీవారికి సేవ చేసే అవకాశం కావాలని పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు  సీఎం జగన్ మీద ఒత్తిడి తీసుకు రావడంతో... ఇటీవల టీటీడీ బోర్డు సభ్యులని 19 నుంచి 29 మందికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా దీనిపై ఆర్డినెన్స్‌ జారీ చేశారు.


చైర్మన్ సహా 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 29 మంది బోర్డు సభ్యులుగా ఉండనున్నారు. అయితే గతంలో ప్రతిపాదించిన విధంగా తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌కు బోర్డులో చోటు కల్పించలేదు. ఇక ఇప్పటికే ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సభ్యుల సంఖ్య పెరగడంతో ఎక్కువమందిని నియమించే అవకాశం ఉంది.


అయితే బోర్డులో ఎమ్మెల్యేలు, పారిశ్రామిక వేత్తలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉండనున్నారు. అలాగే ఇందులో నలుగురు అధికారులు కూడా సభ్యులుగా ఉంటారు. గవర్నర్ కూడా ఆర్డినెన్స్ జారీ చేయడంతో..ప్రభుత్వం అతి త్వరలోనే టీటీడీ పాలకమండలి సభ్యులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీటీడీ బోర్డు సభ్యులని పెంచడంతో... వారికి జీతభత్యాలు, ఇతర సౌకర్యాల వల్ల స్వామివారికి అదనపు భారం అనే చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి.


ఇక జ‌గ‌న్ బోర్డులో ఎవ‌రెవ‌రిని ఉంచాలి ? అనే అంశంపై ఇప్ప‌టికే తీవ్రంగా క‌స‌ర‌త్తులు స్టార్ట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు కోటాలో ఛాన్సు కోసం కూడా తీవ్ర‌మైన ఒత్తిళ్లు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: