నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన దగ్గర నుంచి బీజేపీ తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేసిందన్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతూ ముందుకెళుతుంది. అందులో భాగంగానే కోన ఊపిరితో కొట్టమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఆ పార్టీలో మిగిలి ఉన్న నేతలకు కాషాయ కండువా కప్పేశారు.


టీడీపీతో పాటు కాంగ్రెస్ ని కూడా వదల్లేదు. అసలకే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లాగేసుకుంది. ఇక ఆ పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలనీ బీజేపీ చేర్చేసుకుంది. అయితే ఈ రెండు పార్టీలనే టార్గెట్ చేస్తే అధికారం కష్టమని భావిస్తున్న బీజేపీ...అధికార టీఆర్ఎస్ పై కూడా దృష్టి పెట్టింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలని, ముఖ్య నేతలని లాగేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ లో పెల్లుబికిన అసంతృప్తిని క్యాష్ చేసుకోవడంతో పాటు..క్యాష్ తో నేతల కొనుగోలుకు భారీ మొత్తంలో డబ్బులు కూడా సిద్ధం చేసుకుందని తెలుస్తోంది.


టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసేందుకు దాదాపు రూ. 500 కోట్లు ఎరెంజ్ చేసిందని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలువురు నేతలతో కూడా బేరసారాలు జరిపినట్లు తెలుస్తోంది. అటు ఢిల్లీ పెద్దలు కూడా ఎమ్మెల్యేలతో టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్..బీజేపీ ఎంపీ అరవింద్ తో భేటీ అయ్యి కేసీఆర్ వర్గానికి షాక్ ఇచ్చారు. పైగా అలా డైరెక్ట్ గా కలిసి...తర్వాత పార్టీ మారడం లేదని ప్రకటన చేశారు.


పైకి ఎంత పార్టీ మారడం లేదని చెప్పినా... షకీల్ త్వరలోని బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. షకీలే కాకుండా పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుకు డబ్బు ఆశ చూపించి...వారికి కాషాయ కండువా కప్పేయడానికి బీజేపీ కాచుకుని కుర్చున్నట్లు కనబడుతోంది. మరి రానున్న రోజుల్లో కాషాయ పార్టీ బేరాలు ఏ మేర విజయవంతమవుతాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: