తెలంగాణ‌లో గ‌తేడాది కాలంగా ఎన్నిక‌ల కోలాహాలం కంటిన్యూ అవుతూనే ఉంది. ముందుస్తు ఎన్నిక‌లు ఆ త‌ర్వాత పంచాయ‌తీ, మండ‌లాలు, జిల్లా ప‌రిష‌త్‌లు ఆ త‌ర్వాత లోక్‌స‌భ ఎన్నిక‌లు ఇలా వ‌రుస‌గా ఏదో ఒక ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. గ‌త ఏడెనిమిది నెల‌లుగా తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నిక‌ల‌తోనే కాలం గడిపేస్తూ వ‌చ్చారు. ఇక ఇప్పుడు తెలంగాణ‌లో మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌తో పాటు టోట‌ల్‌గా తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కించే ఎన్నిక రెడీ అవుతోంది. అదే హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌.


గ‌త ఏడాది డిసెంబర్లో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడుగా ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పోటీ చేసి 7 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఉతమ్ ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించ‌డం వ‌రుస‌గా మూడోసారి. ఇక డిసెంర్‌లో అక్క‌డ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్త‌మ్ ఆ త‌ర్వాత ఏప్రిల్‌లో జ‌రిగిన లోక్‌సభ ఎన్నిక‌ల్లో న‌ల్లొండ నుంచి ఎంపీగా 23 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. దీంతో ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో హుజూర్‌న‌గ‌ర్ సీటుకు ఉప ఎన్నిక అనివార్యం కానుంది.


వ‌చ్చే అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ఇక్క‌డ పోటీ చేసేందుకు నాయ‌కులు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నుంచి ఉత్త‌మ్ భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తితో పాటు సూర్యాపేట‌కు చెందిన ప‌టేల్ ర‌మేష్‌రెడ్డి, జానారెడ్డి కుమారుడు ర‌ఘువీర్‌రెడ్డి పేర్లు లైన్లో ఉన్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ నుంచి ప్ర‌ముఖంగా ఇద్ద‌రి పేర్లు లైన్లో ఉన్నాయి. కేసీఆర్ కుమార్తె క‌విత‌తో పాటు గ‌త ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ పై పోటీ చేసి ఓడిన శానంపూడి సైదిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.


ఇక సైదిరెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో భారీగా ఖ‌ర్చు పెట్టి కేవ‌లం 7 వేల ఓట్ల‌తో ఓడిపోయారు. అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ వ‌చ్చింది. ఇక కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ నుంచి ఎంపీగా ఓడిపోయారు. దీంతో ఆమెను కూడా ఇక్క‌డ ఎమ్మెల్యేగా పోటీ చేయించాల‌ని కొంద‌రు ప్ర‌తిపాదిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. క‌విత ఇక్క‌డ పోటీలో ఉంటే హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ఎంత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుందో ?  చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రి



మరింత సమాచారం తెలుసుకోండి: