గత కొన్ని సంవత్సరాలుగా టెక్నాలజీ ఎంతో వేగంగా అభివృధ్ధి చెందుతోంది. టెక్నాలజీని రైట్ వే లో ఉపయోగించుకుంటే ఎంత మేలు చేస్తుందో అదే టెక్నాలజీకి బానిసలుగా మారితే కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. వైజాగ్ కు చెందిన సోనికా కేతావత్ టిక్ టాక్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ టిక్ టాక్ పిచ్చి ఈరోజు సోనికా మరణానికి కారణమైంది. 
 
టిక్ టాక్ యాప్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి సోనికా కేతావత్ సుపరిచితమే. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో పాటు, టిక్ టాక్ వీడియోలు సోనికా కు ఎంతో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. టిక్ టాక్ యాప్ లో సోనికాకు లక్షల సంఖ్యలో ఫాలో అయ్యే అభిమానులు ఉన్నారు. తన అందమైన హావభావాలతో చేసిన వీడియోలు సోనికాకు ఫ్యాన్స్ ఏర్పడేలా చేసాయి. ఇన్ స్టాగ్రామ్ లో కూడా సోనికా కు వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. 
 
సోనికా కేతావత్ కు సినిమాల్లో కూడా నటించటానికి అవకాశాలొచ్చాయి. కానీ సోనికా ఎందుకో సినిమాల్లో నటించటానికి ఒప్పుకోలేదు. బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టమైన సోనికా బైక్ రైడింగ్ చేస్తూ వీడియో చేసే సమయంలో యాక్సిడెంట్ జరిగింది. బైక్ రైడింగ్ చేసే సమయంలో వేగంగా వెళ్లిన సోనికా ఎదురుగా వస్తున్న సైకిల్ ను తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిందని తెలుస్తోంది. 
 
సోనికా శరీరంకు బలమైన గాయాలు తగిలాయి. తీవ్ర రక్త స్రావం జరగటంతో సోనికా ప్రాణాలు కోల్పోయిందని సమాచారం. నల్గొండ జిల్లా సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో సోనికాతో పాటు ఆమె స్నేహితుడు ఉన్నాడు. సోనికా స్నేహితునికి కూడా గాయాలు కావటంతో అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏ యాప్ ద్వారా సోనికా గుర్తింపు తెచ్చుకుందో అదే యాప్ కోసం వీడియో చేసే సమయంలో సోనికా ప్రాణాలు కోల్పోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: