ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ పరిపాలన ఎలా ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరి ఏంటో చెప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగిస్తారా లేక మారుస్తారా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకట్లేదు. సీఎం జగన్ కూడా ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. రాజధాని విషయంలో స్పష్టమైన ప్రకటన లేకపోవటంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నాడని సమాచారం. 
 
ఈరోజు నుండి మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించనున్నారు. గతంలోనే పవన్ అమరావతిలో పర్యటించినా వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకపోవటంతో పవన్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కావటంతో పవన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు పవన్ పర్యటనలో వైసీపీ 100 రోజుల పాలనపై పవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడని తెలుస్తోంది. 
 
అమరావతి పర్యటనలో పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు మరియు కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తాడని తెలుస్తోంది. విజయవాడకు చెందిన వంగవీటి రాధ జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజధానిని మారిస్తే పవన్ కళ్యాణ్ రైతుల తరపున దీక్షకు దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాడు. 
 
పవన్ కళ్యాణ్ జగన్ 100 రోజుల పాలనపై ఒక నివేదికను సిధ్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను ఈరోజు ప్రజల ముందు ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా పర్యటనలు చేసి పార్టీని బలోపేతం చేయటానికి కూడా కృషి చేయబోతున్నాడని సమాచారం అందుతుంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: