ఈ మధ్యకాలంలో బంగారం ధర తగ్గిందంటే .. అవునా తగ్గిందా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆగష్టు నెల అంత బంగారం ధర భారీగా పెరిగింది కాబట్టి. బంగారం ధర పెరిగి మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపించింది బంగారం. అసలు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా మధ్యతరగతి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం కొంత కొంత తగ్గుతూ పసిడి ప్రేమికులకు ఉరటనిస్తుంది.                       


మార్కెట్‌లో ఈరోజు (శనివారం) పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.39,400కు దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇదే తరహాలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయలు తగ్గిపోయి 36,070కు చేరింది.                                        


మరికొంతమంది మాత్రం ఈ తగ్గుదలతో ఆనందంగా లేరు. బంగారం మీ ఇష్టం వచ్చినట్టు పెంచి దానిలో వంద, రెండొందలు తగ్గిస్తారా అని ఫైర్ అవుతున్నారు. మరికొంతమంది మాత్రం ఏదో కొంచం అయినా తగ్గిందిలే అని సంబరపడుతున్నారు. ఏది ఏమైనా వరుసగా ఇలా బంగారం తగ్గుతుంటే పసిడి ప్రియులు ఓ రేంజ్ లో ఆనంద పడుతున్నారు.                                         


మరింత సమాచారం తెలుసుకోండి: