ఆరువారాల్లో అమరావతి నిర్మాణంపై జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తేలిపోతుందా ?  తాజా పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్దిపై  జగన్ నిపుణుల కమిటిని నియమించిన విషయం తెలిసిందే.  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో ఏర్పాటైన కమిటిలో ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్ ప్రాంతాలకు చెందిన అర్బన్ డెవలప్మెంట్, టౌన్ ప్లానింగ్ రంగాల్లో నిపుణులను నియమించారు జగన్.

 

కమిటి బాద్యతలను స్వీకరించిన దగ్గర నుండి ఆరువారాల్లోగా తన నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ కూడా పెట్టింది. దాంతో అమరావతి నిర్మాణంపై ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి తొలగిపోయే అవకాశాలున్నాయి.  నిజానికి చంద్రబాబునాయుడు హయాంలో మూడు నాలుగు తాత్కాలిక  నాసిరకం నిర్మాణాలు  తప్ప మరేమీ జరగలేదు.  వివిధ స్ధాయిలో ఉద్యోగుల కోసం టవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయంతే.

 

నిజానికి చంద్రబాబు ఎంపిక చేసిన  ప్రాంతం రాజధాని నిర్మాణానికి ఏమాత్రం అనువు కాదని గతంలోనే శివరామకృష్ణన్ కమిటి తేల్చి చెప్పింది.  ఈ కమిటితో పాటు పర్యావరణ నిపుణులు, జలవనరుల నిపుణులు, సాయిల్ రంగంలోని నిపుణులు కూడా  అమరావతి ప్రాంతం రాజధానిగా వద్దని నెత్తి నోరు మొత్తుకున్నారు. ఎంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేసినా చంద్రబాబు లెక్క చేయలేదు.


సరే అదంతా చరిత్రగా మిగిలిపోయిందిపుడు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరంభంకాని నిర్మాణాలను నిలిపేశారు. అదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి భద్రతపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. దాంతో అమరావతి ప్రతిష్టను జగన్ దెబ్బ తీస్తున్నాడంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా ఒకటే గోల చేస్తున్న విషయం అందరకీ తెలిసిందే.  ఈ నేపధ్యంలోనే తాజాగా ప్రభుత్వం నియమించిన కమిటితో అమరావతి నిర్మాణంపై జగన్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని అర్ధమవుతోంది. కాకపోతే కమిటి తన నివేదిక ఇచ్చే ఆరువారాల వరకూ ఆగాల్సుంటుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: