కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకుడు డీకే శివకుమార్ హవాలా మరియు విదేశీ ఎక్స్చేంజీల ద్వారా కోటానుకోట్ల నల్ల డబ్బు సంపాదించిన కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అతనిని ఈ నెల ౩వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం మొత్తం రెండుసార్లు సుప్రీంకోర్టుకు బెయిలు మంజూరు చేయవలసిందిగా ఆయన కోరగా రెండుసార్లూ ప్రధాన న్యాయస్థానం అతని విజ్ఞప్తిని తిరస్కరించింది. దేశ రాజధాని ఢిల్లీలోని స్పెషల్ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి సెప్టెంబర్ 17 వరకు డీకే శివకుమార్ కస్టడీలో ఉంచేందుకు అనుమతిచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు అతన్ని విచారించేందుకు తమకు ఇంకొంచెం సమయం కావాలని కోర్టును గడువు కోరారు.

అసలు విషయం ఏమిటంటే ఈ నెల 3వ తేదీన శివకుమార్ ను అరెస్టు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వారు చెప్పిన దాని ప్రకారం హవాలా మరియు విదేశీ ఎక్స్చేంజ్ రూపంలో దాదాపు 200 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే వారు ఇంకా లోపలికి తవ్వగా మొత్తం అతని కుటుంబ కూసాలు కదిలిపోయాయి. డీకే శివకుమార్ కుటుంబ సభ్యులందరికీ కలిసి 317 బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. దాంతో ఇప్పటి వరకు కేవలం 200 కోట్లు అనుకుంటున్న డబ్బు కాస్తా…. 800 కోట్లకు చేరుకుంది. మొత్తం అతను తప్పుడు మార్గల్లో అక్రమంగా సంపాదించినదే. ఇలాంటి పరిస్థితుల్లో శివకుమార్ వంటి వ్యక్తికి బెయిలు మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్నందున దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అతనికి బెయిల్ ను ఈమధ్య రెండోసారి కూడా తిరస్కరించింది.

ఇకపోతే శివకుమార్ తరఫు న్యాయవాది అతను హై బీ.పీతో బాధపడుతున్నాడని... అతని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అతనికి కొద్దిరోజులు విశ్రాంతి కల్పించవలసిందిగా కోరారు. శివకుమార్ తరపు న్యాయవాది అయిన సింఘ్వి చెబుతున్న దాని ప్రకారం ఇలా ఆఫీసర్స్ అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేని తరుణంలో విచారించి అతనిని కన్ఫ్యూజన్ కి గురి చేసి అబద్ధపు నేరారోపణలు మోపుతున్నారట. అయితే ప్రాసిక్యూషన్ వారు మాత్రం ఇప్పటివరకు శివకుమార్ దగ్గర నుంచి తీసుకున్న సమాచారం మొత్తం తనకై తాను ఇచ్చిందే అన… అతని వ్యవహార శైలి లో ఎలాంటి మార్పు గమనించలేదని తమ వాదనను వినిపించారు. ఇప్పటికే చాలా సాక్ష్యాలు తాము సంపాదించామని ఇంకొంచెం గడువు తమకు విచారించేందుకు ఇస్తే ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొస్తామని చెప్పారు.

ఇదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్లు డీకే శివకుమార్ కూతురైన ఐశ్వర్యా ని గురువారం దాదాపు 7 గంటల పాటు తన తండ్రి అక్రమాస్తుల విషయమై విచారించారు. సింగపూర్ మరియు భారతదేశంలో అతనికి ఉన్న ఆస్తులు గురించి ప్రశ్నించి, ఐదేళ్లలో 1.08 కోట్లు మాత్రమే ఉన్న తన ఆస్తులు ఇప్పుడు ఒక్కసారిగా 108 కోట్లకు ఎలా చేరాయి అని వారు ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఢిల్లీ కోర్టు సోమవారం వరకు శివ కుమార్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారి కస్టడీలో ఉంచేందుకు అనుమతినిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: