ఇప్పుడు ఏ యింటి గడపను తొక్కిన వినిపించే మాట ఒకటే జ్వరం.ఇంట్లో వరస పెట్టి అందరికి వస్తున్న ఈ మాయదారి రోగం బారిన ఒక్కరు పడితే చాలు ఆ ఇంట్లో వాళ్లకు బంపర్ ఆఫర్‌లా తగిలేస్తుంది.ఈ జ్వరం బారిన పడి ఎందరో పిల్లల దగ్గరి నుండి,పెద్దలవరకు అల్లాడిపోతున్నారు.ఇప్పుడు రాష్ట్రమంతటా వణికిస్తున్నఈ ఫీవర్, హస్పిటల్ వారికి కాసుల పంటలను పండిస్తున్నాయి.రైతులకు సరిగ్గా కాలం లేకపోయినా డాక్టర్స్‌కు మాత్రం సరిపడా పైసల పంట పండుతుంది.ఇక భారీగా కురిసిన వర్షాల అనంతరం వచ్చే ఎండలతో వాతావరణంలో తడి పొడి పెరిగి దోమలకు అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడల్లా జిల్లాలో పట్టణాలు,పల్లెలు అన్న తేడా లేకుండా జ్వరాలు విజృంభిస్తున్నాయి.



జూలై నుంచి అక్టోబరు వరకు వాతావరణం చల్లబడటం,అనంతరం ఒక్క రోజుల్లోనే వేడి పెరగటం సాధారణమే.కాని ఈ ఏడాది ఆగస్టులోనే ఈ పరిస్థితి ఏర్పడింది.వర్షాలు ఆలస్యం కావడంతో దోమలు,వాటితో వ్యాధుల దాడి ప్రారంభమైంది.ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభించి,జ్వరాలను వ్యాపింపచేస్తున్నాయి.ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.కాని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.ఇప్పుడున్న సీజన్‌కు గవర్నమెంట్ ఆస్పత్రిల్లో సిబ్బంది,కొరత,సరిగా పనిచేయని పరీక్షల పరికరాలు.తోడయ్యాయి.దీనివల్ల అందరికి సరైన సమయంలో వైద్యం అందడంలేదు.దీంతో ప్రైవేట్ దవాఖానకు పోదామంటే లక్షల్లో ఫీజులు వెరసి సామాన్యుడి ఆరోగ్య పరిస్దితి గాలిలో దీపంలా మారింది.ఈ సందర్భంగా ఎందరో పేదలు ట్రీట్మెంట్ చేపించుకునే స్దితిలో లేక అనాధల్లా రోగాలతో నరకయాతన పడుతూ,సహయం కోసం ఎదురు చూస్తున్నారు.



దీన్నిబట్టి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ప్రజా ఆరోగ్యం పడకేసిందని చెప్పవచ్చు.పాలకులు ప్రచారాల్లో పెట్టిన డబ్బులుకాని,శ్రద్ధ గాని ప్రజలపై చూపిస్తే వారికి పైసా ఖర్చుకాకుండా ఓట్లు ఎందుకు పడవు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు..ఇక ప్రస్తుతం వస్తున్న వైరల్‌ జ్వరాలకు ఆందోళన పడవలసిన అవసరం లేదని,వైద్యులు అంటున్నారు. ఇప్పటికే డెంగ్యూ,మలేరియా జ్వరాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకుని వైద్యం చేస్తున్నట్టు తెలిపారు.ఇక జ్వరం సోకినవారు ఫ్లూయిడ్స్‌ ఎక్కువగా తీసుకోవాలన్నారు.ముఖ్యంగా టైఫాయిడ్‌ వంటి జ్వరాలు రాకుండా చూసుకోవాలంటే వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని తెలిపారు.ప్రతి ఏరియాలో వారానికి ఒకసారి మునిసిపాలిటీ వారు యాంటీ లార్వా ఆపరేషన్‌లు చేయాలన్నారు.ప్రజలు కూడా దోమల భారి నుంచి రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అంతే కాకుండా జ్వరాల నియంత్రణపై ప్రభుత్వ వైద్యులు,ఆరోగ్య సిబ్బంది పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఈ సందర్భంగా వైద్యాధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: