వాహనదారులకు జరిమానాలు అంటూ పెద్ద చిల్లు పెట్టిన ఇప్పుడు ఈ వార్త ఒకరకంగా శుభవార్త అని చెప్పచు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదొక వాహనం ఖచ్చితంగా ఉంటుంది. కొందరి ఇళ్లల్లో అయితే ఒకటికి రెండు, లేదా మూడు వాహనాలు కూడా ఉంటాయి. అలా వాహనాలు ఉన్న వారికీ వారానికి వేళల్లో ఖర్చు వస్తుంది. ఏ ఖర్చుని అయినా అపచ్చు కానీ పెట్రోల్, డీజల్ ఖర్చు మాత్రం ఎవరు ఆపలేరు.                             


అయితే ఆ ఖర్చులో కొంత మేము భరిస్తామంటూ వచ్చాయి రెండు సంస్ధలు. సంవత్సరానికి దాదాపు 70లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ ఆఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) క్రెడిట్ కార్డు వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందట. కారణం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), బీపీసీఎల్‌ అంటే భారత పెట్రోలియం బంక్ తో జతకట్టింది.                       

 

ఎస్‌బీఐ బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డును ఇస్తుంది. ఈ కార్డు కోసం అప్లై చేసుకుంటే 2,000 యాక్టివేషన్ బోనస్ పాయింట్లు వస్తాయి. అయితే ఈ కార్డులో తీసుకోడానికి జాయినింగ్ ఫీజు రూ.500. ఈ ఫీజు చెల్లించిన 20 రోజుల తర్వాత 2,000 పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్ల ద్వారా భారత్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకోవచ్చు. అంటే ఈ కార్డు ద్వారా సంవత్సరానికి 70 లీటర్ల పెట్రోల్, డీజల్ ధరలు ఉచితం.                     


మరింత సమాచారం తెలుసుకోండి: