సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. మనుషులు మరి పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితికి వెళ్ళిపోతున్నారు. వావి వ‌ర‌స‌లు పూర్తిగా మరిచి పోతున్నారు. తాజాగా తమిళనాడులో ఓ ఘోరమైన సంఘటన జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ విద్యార్థి త‌న‌కు పాఠాలు నేర్పే టీచ‌ర‌మ్మ‌పైనే అత్యాచారానికి ప్రయత్నించాడు. చివరకు ఆ టీచరమ్మ తనపై విద్యార్థి బలాత్కారం చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించి తన మానం కాపాడుతుంది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురైయూర్ యూనియన్ కోంబై గ్రామ పరిధిలోని మరుదై కొండ అనే అటవీ గ్రామం ఉంది.


ఈ ప్రాంతంలో ఎక్కువుగా గిరిజ‌నులే నివ‌సిస్తూ ఉంటారు. ఇక్కడి గిరిజన ఆదివాసీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసింది. దీనికి 26 ఏళ్ల యువ ఉపాధ్యాయురాలును నియమించింది. అయితే గ్రామం చుట్టూ అడవి ఉండడం.. రెండు కిలోమీటర్లు అడవీలో ప్రయాణించి టీచర్ విద్యార్థులకు చదువు చెప్పేందుకు వచ్చేది. ప్రతిరోజు ఆ యువ టీచరమ్మ రెండు కిలోమీటర్ల నడిచివచ్చి విద్యార్థులకు పాఠాలు చెప్పి తిరిగి అడవిలో రెండు కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేది.


తాజాగా ఒక రోజు ఇంటికి వెళుతున్న క్రమంలో అటవీ మార్గంలో నడుస్తూ ఉండగా విద్యార్థి బాలుడు టీచర్ పై కన్నేసి ఆమె వెంట నడుచుకుంటూ వెళ్లి... అడవి మధ్యలో ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె తీవ్రంగా ప్రతిఘటించి ఆ బాలుడి నుంచి తప్పించుకుని గ్రామస్తులకు చెప్పింది. ఆగ్ర‌హంతో గ్రామస్థులంతా బాలుడిపై తురైయూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.


పోలీసులు మాత్రం బాలుడు కావ‌డంతో కేసు న‌మోదు చేయ‌లేదు. బాలుడు.. టీచర్ కు సర్ధిచెప్పి పంపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి కొండ గ్రామ ప్రజలు బాలుడిని అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. లేకపోతే విద్యార్థులకు, మహిళలకు భద్రత లేదని పోలీసులను డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: