ఇలాంటి బడ్జెట్ ఎప్పుడూ రాలేదు అనేది కరెక్టే అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంగీకరించారు. శనివారం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై చర్చ వాడివేడిగా జరిగింది. ఈ సందర్బంగా  సీఎం కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా పద్దులపై జరిగిన చర్చలో కేసీఆర్ మాట్లాడారు. ఇటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి కారణం దేశ ఆర్ధిక పరిస్థితేనన్నారు. దేశంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితి ఎప్పుడూ లేదని చెప్పారు.



ఆర్ధిక రంగం తగ్గుముఖం పట్టడంతో ఇలాంటి బడ్జెట్ పెట్టాల్సి వచ్చిందని సీఎం అన్నారు. కేంద్రం నుంచి  రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కూడా కోత పెట్టిందన్నారు.  మన రాష్ట్రాన్ని మనం శపించికోవడం మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రాన్నితామేమన్న దివాలా తీయించామా అని ఎదురు ప్రశ్నించారు. ఎన్నో రాష్ట్రాల కంటే చాలా ఉత్తమమైన పద్ధతిలో రాష్ట్రము ఉందని స్పష్టం చేశారు.  దేశంలో మొత్తం 28 రాష్ట్రాల్లో మనం ఏ ర్యాంక్ లో ఉన్నాం అనేది త్వరలోనే చెప్తాం. మా దగ్గర లెక్కలేదు అనేది ఏమీ లేదు. అబద్దాలు మాత్రం చెప్పొద్దు. అది మానుకోండి” అన్నారు సీఎం కేసీఆర్.
కాగా మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని.. ఆరేళ్లలో దివాలా తీసిన రాష్ట్రంగా మార్చార ని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క  తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. పూర్తిగా దివాలా తీసిన ప్రభుత్వంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు.





ఓటాన్ బడ్జెట్ తో పోల్చితే రూ.36వేల కోట్ల కోత పెట్టారన్నారు. దీనికి  సీఎం కేసీఆర్ ఘాటుగా  స్పందించారు . ఆరేళ్ల కిందట అసలు రాష్ట్రమే లేదన్నారు. అలాంటప్పుడు  మిగులు బడ్జెట్ ఎక్కడినుంచి వస్తుంది నిలదీశారు. మిగులు బడ్జెట్ అంటూ మాట్లాడడం  పెద్ద జోక్ అని కొట్టుపారేసారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు బడ్జెట్ అంచనాలకు, తయారీకే సరైన ప్రాతిపదికలే లేవన్న విషయాన్ని సీఎం ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆ విషయాన్ని కూడా తాము బడ్జెట్ లో  వివరించామన్నారు. రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు మిగులు బడ్జెట్ లో ఉందనేది వాస్తవం కాదన్నారు.  పోతన లేనివిధంగా మాట్లాడుతూ ఇటు సభను, సభలోని సభ్యులను, అటు ప్రజలను పక్క దారి పట్టించడం ఎంతమాత్రం కరెక్ట్ అని  సీఎం కేసీఆర్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: