శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పరీక్షల ఫలితాల విషయంలో తప్పులు దొర్లటం జరుగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలలో తప్పులు దొర్లాయి. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను చూసుకొని నిరాశకు లోను కావటం జరిగింది. పరీక్ష ఎంతో బాగా రాసినప్పటికీ ఫెయిల్ కావటంతో నిరాశకు లోనయిన హరి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
హరి పుత్తూరు జిల్లాలోని ఒక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో నిర్లక్ష్యం వలనే ఈ ఘటన చోటు చేసుకుందని విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అధికారులు ఈ ఆరోపణలలో నిజం లేదని చెబుతున్నప్పటికీ నలుగురు ఉద్యోగులకు ఈ విషయంపై మెమోలు జారీ చేశారని తెలుస్తోంది. 
 
ఏప్రిల్, మే నెలలో నిర్వహించిన సెకండ్ సెమిస్టర్ ఫలితాలలో ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ మార్కులను రెండూ కలిపి ఫలితాలను విడుదల చేయగా పరీక్ష ఫలితాలలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ఇంటర్నల్ మార్కులు కలపకపోవటంతో తక్కువ మార్కులొచ్చాయని విద్యార్థులు , విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొంతమంది పరీక్షకు హాజరు అయినప్పటికీ పరీక్షకు హాజరు కాలేదని వచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఏఐఎస్ ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ సంఘాలు ఈ విషయం గురించి పురపాలక భవనం ఎదుట నిరసన కూడా తెలిపాయి. రెండో సెమిస్టర్ ఫలితాల విషయంలో తప్పులు దొర్లటంతో ఇద్దరు క్లర్క్ లకు, సూపరిండెంట్ కు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కు మెమోలను జారీ చేసారని తెలుస్తుంది. పరీక్షల ఫలితాల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. పరీక్షల ఫలితాల ద్వారా నష్టపోయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీవాల్యువేషన్ నిర్వహించాలని ఏఐఎస్ ఎఫ్ నాయకులు కోరారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: