శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ యూనివర్సిటీకి 65 సంవత్సరాలు గొప్ప చరిత్ర ఉంది. కానీ అంత గొప్ప చరిత్ర ఉన్న యూనివర్సిటీకి ఈరోజు సభ్యసమాజం సిగ్గుపడే విధంగా ఆ విద్య సంస్ధలో ఘోరమైన ఘటన జరిగింది. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదువుకొని ఓ ఉన్నత స్థానికి ఎదిగిన ఓ వికలాంగుడిని ఘోరాతి ఘోరంగా అవమానించారు. 


ఎస్వీ యూనివర్సిటీని కించపరిచే విధంగా విద్య సంస్ధలో రాజకీయ హింస చేశారు కొందరు. అనవసరంగా దాదాపు 30 నిమిషాలపైనే నిర్బంధించి రాజకీయ కక్షని ఆ వికలాంగుడిపై విచక్షణ రహితంగా తీర్చుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 10 మంది వికలాంగ అధికారిపై 30 నిమిషాల పాటు నిర్బంధించి మాటల దాడి చేసి, హావ భావాలతో ఆ వికలాంగుడిని మానసికంగా ఇబ్బంది పెట్టారు. 


ఎస్వీయూకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు సాంకేతిక సర్వీసులని అందిస్తున్న కంపెనీ ప్రతినిధిని సాక్షాత్తు ఇంచార్జి రిజిస్ట్రార్ మీటింగ్ కు రిజిస్ట్రార్ ఆఫీస్ కు రమ్మని పిలిచి ఆ కంపెనీ పనిచేస్తున్న పని గురించి అసలు ఏ మాత్రం సంబంధం లేనివారు ఆ కంపెనీ ప్రతినిధి వికలాంగుడిపై విచక్షణ జ్ఞానం కూడా లేకుండా మాటల దాడి చేసి హావ భావాలతో ఆడుకొని వికలాంగుడిని మానసికంగా భాధ పెట్టి.. భయపెట్టి అతనికి అధికారంలేదు అన్న, తాను సంతకం చెయ్యను అని చెప్పిన వారికీ కావాల్సిన సంతకాన్ని వారి డాక్యూమెంట్లపై చ్చేయించుకోని వదిలేశారు.   


ఈ సంఘటన గురించి విన్న ప్రజలు మంది పడుతున్నారు. చట్టాలను సృష్టించే వారు పంచాయితులు చేస్తారా ? సిగ్గు ఉండాలి అంటూ ఘాటుగా బదులు ఇస్తున్నారు. మరి కొందరు స్పందిస్తూ 'చదువు సంధ్యలు లేకుండా అతను అధికారి అవ్వలేదు. అతను వికలాంగుడు అయినప్పటికీ అయన ఎంతో కష్టపడి పైకి వచ్చాడు..''అంటూ సమాధానాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఓ అధికారి పట్ల ఆలా ప్రవర్తించడం పద్ధతి కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: