మనజీవితంలో ఎక్కడైన అంగవైకల్యంతో వున్న వారు కనిపిస్తే ఎంతటి కఠినాత్ములకైన ఎక్కడో ఒకచోట జాలి,దయ వుంటుందని వింటున్నాం కాని ఎస్వీయూ లో జరిగిన ఘటన మానవత్వం మాయమవుతుందని ప్రత్యక్షంగా నిరూపించిందని చేబుతున్నారు. మనం ఇంత చదువులు చదివి,వయ్సస్సుతో పాటు హోదాలో పెద్దవారిగా చలామని అవుతూ సమాజంలో ప్రవర్తంచే విధానం ఇదే అని నేర్పారేమో చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు అని అనిపిస్తుందట కొందరికి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు. ఇక అయ్యేపాపం అని పైపైకి నటించడం కాదు మనిషి గుణం.సాటి వారిని కూడా గౌరవించి వారు మనలాంటి వారే అని భావించడమే నిజమైనదైవత్వం.ఏదైనపని జరగాలంటే భయపెట్టి చేపించుకోవడమనే విధానానికి స్వస్తిపలకలేనివారు వున్నంత కాలం బలం లేని అమాయకులు భయపడుతూ జీవిస్తుంటారని ఎందరో మహానుభావులు అన్నారట..



నీకు నచ్చినట్లు బ్రతుకు కాని నీ బ్రతుకులోకి మరొకర్ని లాగకు,నీ వల్ల నలుగురికి మేలు జరగక పోయినా ఫర్వాలేదు కాని కీడు తలపెట్టకు అనే సూక్తులు చదవడానికి మాత్రమే పనికొస్తాయా? ఆచరించడానికి పనికిరావా అని ప్రశ్నించే వారు లేకపోలేదు.ఇక ఎవరినైన ఇబ్బంది పెడుతుంటే వారు ధీనంగా వేడుకుంటే వదిలేస్తారు ఎంత కఠినాత్ములైన. కాని ఎస్వీయూ లో జరిగిన విషయం తెలిసిన వారు దయ,జాలి అతని పట్ల కనపరచకుండా వికలాంగుడని కూడా చూడకుండా ఎంతటికి దిగజారారు అని అనుకుంటున్నారట. ఒక వికలాంగుడిపై ఎస్వీయూ ప్రతాపం అనేది ఎట్టి పరిస్థితులలోనూ సమర్థనీయము కాదు కదా అని మరికొంతమంది పెద్దవారు కూడా విమర్శిస్తున్నారట.



ఇక వికలాంగుడిపై దాడి జరిగిన విషయం తెలసిన వారు రామేశ్వరము పోయినా శనేశ్వరము వదల్లేదన్నట్లుగా వైఎస్సార్సీపీ పూర్తి పారదర్శక పాలన వచ్చిన తరువాత కూడానా ఎస్వీయూ రిజిస్ట్రార్ ఇంతకుముందు ఉన్న అధికార పార్టీయొక్క ఎజెండాను తన భుజ స్కంధాలమీద మోస్తున్నారు.అమాయకులను ఇంకా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తమ నిరసనలు తెలియ చేస్తున్నారట.ఈ యూనివర్సిటిలో తప్పక పాప ప్రక్షాళన చేయాలని తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు వికలాంగూడని కూడ చూడని పెద్దమనుషులు మరోసారి వారి ఆగ్రహనికి ఇంకెంత మందిని బలిచేస్తారోనని ఆందోళన పడుతున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: