ఎన్నికల ముందు టీడీపీ-బీజేపీ పార్టీలు ఏ రేంజ్ లో కత్తులు దూసుకున్నాయో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ పార్టీల నేతలు తెల్లారితే చాలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. అయితే అప్పుడు ఉప్పు-నిప్పులా ఉన్న రెండు పార్టీలు ఎన్నికల తర్వాత రహస్య స్నేహం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అందుకు కారణం ఏపీ బీజేపీలో చంద్రబాబు కోవర్టులు ఉండటమే అని తెలుస్తోంది. టీడీపీ ఘోర  ఓటమి తర్వాత చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే సుజనా చౌదరీ, సీఎం రమేశ్, టీజీ వెంకటేష్ లు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.


వీరే బాబుకు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం ఉంది. పైగా వీరు బాబు ప్రోత్సాహంతోనే బీజేపీలో చేరారని టాక్ ఉంది. అయితే వీరు చేరిన దగ్గర నుంచి బీజేపీ అధికార వైసీపీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడం పెరిగింది. ముఖ్యంగా వీరు బాబు మీద ఈగ వాలనివ్వకుండా....మీడియా ముందు జగన్ పై ఫైర్ అవుతున్నారు. ఇక ఈ కోవర్టులు బీజేపీలో పూర్తిగా డామినేట్ చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యలరావు లాంటి నేతలని సైతం పక్కకి తోసేస్తున్నారు.


అలాగే సోము వీర్రాజు లాంటి ఫైర్ బ్రాండ్ నేతలని ఎక్కువ మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. మొత్తం పార్టీలో తామే అనే విధంగా నడుచుకుంటున్నారు. అందుకే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి నేతలు కూడా వీరిపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కూడా ఈయన బీజేపీలో బాబు కోవర్టులు ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. ఆ కోవర్టులు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాల కంటే చంద్రబాబుపైనే విధేయత కనబరుస్తున్నారని ఎద్దేవా చేశారు.  


ఆఖరికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కార్యదర్శులను సైతం పక్కకు నెట్టి కొత్తగా పార్టీలో చేరిన బాబు కోవర్టులు పార్టీని కంట్రోల్ చేస్తున్నారని విమర్శించారు. ఈ బానిసలకు మోడీ, అమిత్ షాల కంటే చంద్రబాబే ముఖ్యమని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: