ఎవరు అవునన్నా కాదన్నా జగన్ మాత్రం ఓ బలమైన ఫోర్స్. అంతే కాదు, ఏపీతో పాటు దేశ రాజకీయలపైన బలమైన ముద్ర వేశారు. వర్తమాన రాజకీయల్లో ఆయన‌కు గుర్తింపు ఉంది. ఇక చరిత్రలో ఆయనకు స్థానం కూడా ఉంది. ఎన్ని పేజీలు అన్నది ఆయన ముందు ముందు రాజకీయం చెబుతుంది. ఇక జగన్ని స్పూర్తిగా తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. జగన్ని పబ్లిక్ గా విమర్శించినా  ప్రైవేట్ సంభాషణల్లో జగన్ని, ఆయన కష్టాన్ని  మెచ్చుకున్న వారూ ఉన్నారు. అటువంటి జగన్ పొరుగున ఉన్న ఓ రాష్ట్ర నాయకునికి ఆదర్శం అవుతున్నారా అంటే పరిణామాలు అవునని అంటున్నారు.


కన్నడ నాట  కాంగ్రెస్ నేత  డీకే శివకుమార్ పేరు చెబితే మంచి లీడర్, ట్రబుల్ షూటర్ అంటారు. ఆయన కాంగ్రెస్ లో డైనమిక్ లీడర్ గా పేరు సంపాదించుకున్నారు. ఆయన అద్రుష్టం బాగులేదు కానీ ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి. ఇక్కడ కూడా జగన్ తో పోలిక ఉంది. ఇక డీకే  ఇపుడు తానే బిగ్ ట్రబుల్లో పడ్డారు. ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి. అయితే ఆయన్ని వాడుకున్న కాంగ్రెస్ వర్గాలు ఇపుడు మాత్రం పక్కన పెడుతున్నాయట. దీంతో డీకే వర్గీయులు రగిలిపోతున్నారు. మా నేత సేవలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కూడా అంటున్నారు.


ఇక డీకే ఈ కేసుల కారణంగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇది కూడా జగన్ తో మరో పోలికగా ఉంది. డీకే కేసులు కూడా రాజకీయ కక్ష సాధింపువి కావడం మరో విశేషం. దాంతో మండిపోతున్న ఆయన అనుచరులు కాంగ్రెస్ ని వదిలేయమంటున్నారు. వేరేగా పార్టీ పెట్టుకోమంటున్నారు. కాంగ్రెస్ సాయం లేనపుడు నాయకులు పట్టించుకోనపుడు ఆ పార్టీలో ఉండి లాభం ఏంటి అన్నది వారి ప్రశ్న. డీకే కూడా ఇలాగే ఆలోచిస్తున్నారని అంటున్నారట. ఏపీలో కాంగ్రెస్ ని ఎదిరించి కొన్నాళ్ళు కష్టాలు పడ్డా కూడా జగన్ ఇపుడు సీఎం అయ్యారు. తనకు చరిష్మా ఉందని బలంగా నమ్ముతున్న డీకే సొంత పార్టీ పెట్టి కర్నాటక సీఎం కావాలనుకుంటున్నారట. అదే జరిగితే కాంగ్రెస్ పని ఖతమేనని అంటున్నారు. బలమైన వక్కలిక సామాజికవర్గానికి చెందిన డీకే పార్టీ పెడితే జగన్ బాటలో నడిచినట్లేమరి.
 



మరింత సమాచారం తెలుసుకోండి: