హిట్లర్ అంటే ప్రపంచానికి తెలిసినంతవరకు ఆయనో క్రూరుడు. యూధులను హింసించిన జర్మనీ నియంత. రెండో ప్రపంచ యుద్దం సమయంలో ప్రపంచాన్ని గడగడలాండించిన హిట్లర్ యుద్దం తరువాత ఓ చిన్న నెలమాళిగలో తన భార్య ఇవా బ్రువాన్ తో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రపంచానికి నియంతగా, అత్యంత క్రూరుడిగా తెలిసిన హిట్లర్లో మనకు తెలియని ఓ కోణం ఉన్నది. అదే ఆయన ప్రేమ. ప్రేమించిన ఇవా చాలా బాగా చూసుకునేవాడట.

అయితే, దేశం మీదున్న అభిమానం. ప్రేమ కారణంగా ఇవాను దూరంగా ఉంచాడు. దూరంగా ఉంచినప్పటికి రెండో ప్రపంచయుద్దం సమయంలో మరణించడానికి కొద్ది రోజుల ముందు ఆయన ఇవాను పెళ్లి చేసుకున్నాడు. హిట్లర్ కు మూడు విషయాలు అంటే మహా ఇష్టం. ఒకటి దేశం. రెండోది తన కుక్క బ్లాండీ. మూడో వ్యక్తి ఇవా బ్రువాన్. ఇవా హిట్లర్ కంటే 23 సంవత్సరాలు చిన్నది. అయితే, 16 సంవత్సరాల పాటు ఇవా హిట్లర్ కు ఎంతో సన్నిహితంగా విశ్వాసపాత్రు రాలిగా ఉంది. ఇవా చూపించిన విశ్వాసానికి హిట్లర్ ఎంతగానో మురిసిపోయేవాడు.

ఇవాగురించి పొగడాల్సి వచ్చినపుడు తన పెంపుడు కుక్క బ్లాండిని చూపుతో దానితో పోల్చేవాడు. హిట్లర్ మరణించేముందు బ్లాండీ కి కూడా విషం ఇచ్చాడు. ఇవాకు 17 సంవత్సరాల వయసు ఉండగా హిట్లర్ ఆమెను మొదటిసారిగా కలిశాడు. అప్పటికి హిట్లర్ వయసు 40 సంవత్సరాలు. ఇవా ఫోటోగ్రఫి అసిస్టెంట్ గా పనిచేస్తుంది. ఇవాను చూడగానే హిట్లర్ ఆమె మాయలో పడిపోయాడు. ఎంతవారులైన కాంత దాసులే కదా. ఎలాంటి నియంత అయినా అమ్మాయి క్రీకంటి చూపులకు పడిపోవలసిందే. అయితే ఇవా ఇంట్లో వారి అనుబంధానికి ఒప్పుకోలేదు. కానీ, ఇవా పట్టువదలకుండా ఇంట్లో వారిని ఒప్పించి హిట్లర్ ను పెళ్లాడింది.

ఇవా పై ప్రేమ ఉన్నప్పటికి హిట్లర్ ఆ ప్రేమను బయటకు చెప్పేవాడు కాదు. హిట్లర్ అంటే దేశాన్ని ప్రేమించే వ్యక్తిగానే ఉండాలి అని కోరుకునేవాడు. అందుకే ప్రేమను బహిర్గతం చేయలేదు. ఇక ఇవాను అంత తేలిగ్గా హిట్లర్ ప్రేమించలేదు. ఆమె అంటే ఇష్టం ఉన్నప్పటికి, ఇవా యూదు మొదట్లో సందేహించాడు. ఆమె గురించిన పూర్తి వివరాలను కుటుంబం నుంచి, బందువుల నుంచి తెలుసుకొని ఆమె నిజమైన ఆర్యన్ జాతికి చెందిన స్త్రీ అని దృవీకరించుకున్నాకే ఆమెతో డేటింగ్ కు అంగీకరించాడు.

అయితే, ఇవాకు అంత స్వేచ్చా ఇచ్చేవాడు కాదని, బయట పార్టీలకు వెళ్ళేందుకు ఒప్పుకునేవాడు కాదని కనీసం బయట ఎవరితోనూ కలిసేందుకు కూడా ఒప్పుకునేవాడు కాదని తన డైరీలో రాసుకుంది. అంతేకాదు, ఇవా 1932 లో ఒకసారి, 1935 మరోసారి అత్యహత్య ప్రయత్నం చేసిందట. ఇవాకు ఉన్న ఒకేఒక్క కోరిక తను మరణించేలోపు హిట్లర్ తనను వివాహం చేసుకోవాలని. ఆ కోరిక ఎలాగైతేనేం నెరవేరింది. అది దురదృష్టమో లేక ఆమె అధృష్టమో తెలియదు కానీ.. పెళ్లి చేసుకున్నా కొన్ని రోజులకే అంటే ఏప్రిల్ 29, 1945 నా ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు మరణించక తన వీలునామా బయటపడింది. ఆ వీలునామా ప్రకారం..తను చేసిన పాపాలకు, ఘోరాలను చలించిపోయానని.. ప్రజలకు చేసిన పాపాల నుంచి బయటపడటానికి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. ఇద్దరిని ఒకేచోట ఖననం చేయాలని రాసుకున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: