భారతదేశంలో సంప్రదాయాలను పాటించేవారు సంఖ్య అధికం. ఇక మూఢ నమ్మకాలను ఫాలో అయ్యేవారి గురించి ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ప్రపంచంలో భారతీయులే ఎక్కువగా గుడ్డిగా మూఢనమ్మకాలను ఫాలో అవుతారు అనే వాదన ఉండేది. ఈ వాదన సరైనది కాదు. మనం మన సంప్రదాయాలను, నమ్మకాలను ఎలాగైతే పూర్వకాలం నుంచి నమ్ముతూ వచ్చామో.. వస్తున్నామో..

ఇతరదేశాల వారు కూడా అందులోను టెక్నాలజీ పరంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ప్రజలు కూడా అక్కడి సంప్రదాయాలను, మూఢనమ్మకాలను గుడ్డిగా ఫాలో అవుతూనే ఉన్నారు. కేవలం భారతీయులే ఈ మూఢ నమ్మకాలను ఫాలో అవుతున్నారు అని అనుకుంటే మాత్రం మీరు బురదలో కాలు వేసినట్టే. మనం కేవలం బురదలో లేదంటే పప్పులో కాలువేస్తారని అంటుంటారు.  కానీ, కొన్ని దేశాల వారు మాత్రం ఏకంగా కుక్క అసూచికం మీద కాలు వేస్తారట. అది అక్కడి వారి నమ్మకం. దీనిని ఏమనుకోవాలి చెప్పండి. ఇతరదేశాల్లోని ప్రజలు ఎలాంటి నమ్మకాలను ఫాలో అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

కొరియాలో ప్ర‌జ‌లు గ‌ర్భ‌వ‌తులైన వారి గురించి విచిత్ర‌మైన మూఢ‌న‌మ్మ‌కం ప్రచారంలో ఉంది. గ‌ర్భ‌వ‌తులుగా ఉన్నవారు ప్లేటులో చెల్లాచెదురుగా ఉన్న ఆహారాన్ని తినరు. అలా తింటే పుట్టే పిల్లలు కళావిహీనంగా పుడతారని అక్కడి వారి నమ్మకం.

జ‌పాన్ ప్ర‌జ‌లు త‌మ జీవితాల‌కు ఎలాంటి దిశానిర్దేశం లేక‌పోయినా .. చ‌నిపోయాక ఒక దిశ ఉంద‌ని భావిస్తారు. అందుకే మరణించాక వారిని ఉత్త‌ర దిక్కులోనే ఖననం చేస్తారు. మనలాగే ఉత్త‌రం దిక్కున త‌ల పెట్టి ప‌డుకోవ‌డాన్ని అశుభంగా భావిస్తార‌ట‌.

మనం బయటకు వెళ్ళినపుడు ఏ చెట్టుమీద ఉన్న పిట్టైనా రెట్ట వేసిందో అనుకో.. చికాకుపడిపోతాం. కానీ, ర‌ష్యాలో మాత్రం ప్ర‌జ‌లు దీన్ని అదృష్టంగా భావిస్తారు. త్వ‌ర‌లో త‌మ‌కు పెద్ద మొత్తంలో సంప‌ద రాబోతుంద‌ని క‌ల‌లు కంటారు.

ఇక టర్కీ దేశవాసులది అత్యంత విచిత్ర‌మైన మూఢ‌న‌మ్మ‌కాని ఫాలో అవుతుంటారు. రాత్రిపూట ప్ర‌జ‌లు చూయింగ్ గ‌మ్ తింటే అది కుళ్లిన మాంసం తిన‌డం కింద భావిస్తార‌ట‌. అందుకే అక్కడివారు రాత్రిసమయాల్లో చూయింగ్ గమ్ నమలరు.

అపుడప్పుడు కొందరు వెనక్కి నడుస్తుంటారు. అంటే జీవితంలో కాదు. సరదాగా అలా నడుస్తుంటారు. కానీ, పోర్చుగీస్ దేశ‌స్థులు వెన‌క్కి న‌డుస్తుంటే ద‌య్యానికి దారి చూపించిన‌ట్టుగా పోర్చుగీసువారు భావిస్తార‌ట‌. హోటల్ కు వెళ్ళినపుడు కార్నర్ సీట్ లో కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ భోజనం చేయడం అంటే మనకు సరదా. కానీ, హంగేరియన్లు, ర‌ష్య‌న్లు కార్న‌ర్ టేబుల్ లో కూర్చొని డిన్న‌ర్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అలా తింటే పెళ్లి అయ్యే అవ‌కాశాలు త‌గ్గిపోతాయ‌ట‌. దీనికి పెళ్లికి ఎలా సంబంధ‌మో అస్సలు అర్థంకావ‌డం లేదు.

ఫ్రెంచ్ వాళ్ళ ఆచారం మహావిచిత్రంగా ఉంటుంది. కుక్క మలినాన్ని అక్కడివారు శుభానికి గుర్తుగా భావిస్తారు. కుక్క మలినాన్ని ఎడ‌మ కాలితో తొక్కితే అదృష్ట‌వంతుల‌ని .. కుడి కాలితో తొక్కితో దుర‌దృష్టం వెంటాడుతుంద‌ని విశ్వ‌సిస్తారు. చాలా విచిత్రంగా ఉన్నది కదూ. 


మరింత సమాచారం తెలుసుకోండి: