భారతీయ అంతరిక్ష  పరిశోధనా సంస్థ (ఇస్రో) చంధ్రయాన్-2 ప్రయోగంతో అంతర్జాతీయ కీర్తిని గడించింది. చంద్రుడి దరిదాపుల్లోకి వెళ్ళిన విక్రం ల్యాండర్ ఓ విధంగా విజయం సాధించిందనే చెప్పాలి. దాంతో మొదటి ప్రయోగంలోనే చంద్రునికి అతి చేరువలోకి ల్యాండర్ ని చేర్చిన  ఘనత ఇస్రో దక్కించుకుంది.  ఇక ఇస్రోకి కొండంత భరోసా ప్రధాని మోడీ ఇచ్చారు. 130 కోట్ల మంది భారతీయులు వెన్నంటి ఉన్నారు. దాంతో ఎక్కడా తగ్గకూడదని ఇస్రో నిర్ణయించుకుంది.


ఈ నేపధ్యంలో ఇస్రో వరసగా ప్రయోగాలకు రంగం సిధ్ధం చేసింది. మరో పదేళ్ళకు భారీ షెడ్యూల్ ని ఖరార్ చేసింది.  2030 వరకూ ఇస్రో నుంచి ప్రయోగాలే ప్రయోగాలు అన్న మాట. వచ్చే ఏడాది సూర్యునిపై ప్రయోగానికి  ఆదిత్య ఉప గ్రహాన్ని ఇస్రో పంపించబోతోంది. దాంతో సూర్యునిలో దాగున్న రహస్యాలను అదిత్య ఛెదిస్తుందన్న మాట.ఇక ఇస్రో 2021లో గగన్ యాన్  పేరు మీద  మానవ సహిత ప్రయోగాన్ని కూడా చేపడుతోంది. అదే విధంగా 2024లో  చంద్రయాన్ 3, మంగళయాన్-2 ప్రయోగాలు చేపడుతోంది. 



దీని కోసం కచ్చితమైన ప్రణాళికను ఇప్పటి నుంచే సిధ్ధం చేసుకుంది. ఇక 2025 శుక్రునిపైన అధ్యయనం కోసం శుక్రయాన్  ఉపగ్రహం కూడా ఇస్రో నుంచి అంతరిక్షంలోకి  దూసుకుపోనుంది. అదే విధంగా 2030 నాటికి అంతరిక్షంలో  స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసేలా  ఇస్రో రూపకల్పన చేసింది. మొత్తం మీద చూసుకుంటే ఇస్రో ఎక్కడా తగ్గనంటోంది.



తన భారీ  షెడ్యూల్   చూసినా యాక్షన్  ప్లాన్ తీసుకున్నా భారతీయులు మరింత గర్వించేలా  ఘనమైన ప్రయోగాలతో ముందుకువస్తోంది. ఈ సమయంలో ఇస్రో పరిశోధకులకు ప్రతీ ఒక్కరూ సెల్యూట్ చేయాల్సిందే. వారి క్రుషికి ధన్యవాదాలు, అభినందనలు తెలియచేయాల్సిందే. జయహో ఇస్రొ అనాల్సిందే ప్రపంచమంతా.  ఆల్ ది బెస్ట్




మరింత సమాచారం తెలుసుకోండి: