రాష్ట్రం లో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉందని  హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న టీఆరెస్ సర్కార్  , సహజసిద్ధమైన నల్లమల అడవులను ధ్వంసం చేసే యురేనియం తవ్వకాలకు అనుమతించడం ఏమిటనీ పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు . నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం విధ్వంసం కావడమే కాకుండా , తాగునీరు కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఒకవైపు అడవులను పెంచాలంటూనే , మరొకవైపు ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన  అడవిని ధ్వంసం చేసే చర్యలకు అనుమతించడం రాష్ట్ర ప్రభుత్వ ద్వంధ వైఖరికి నిదర్శనం కాదా ?  మండిపడుతున్నారు .


 గతం లో నల్లమల అడవుల్లో వజ్రాల నిక్షేపాల తవ్వకాలకు ఆనాటి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు  అనుమతిస్తే ఆందోళనకు దిగి , స్థానికులకు దన్నుగా  నిలిచిన టీఆరెస్ నేతల గొంతులు ఇప్పుడు ఎందుకు పెగలడం లేదని ప్రశ్నిస్తున్నారు  . వజ్రాల నిక్షేపాల తవ్వకాలను వ్యతిరేకిస్తూ గతం లో  నల్లమల చెంచు గూడాలకు  వెళ్లి , పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా  మాట్లాడిన మాజీ ఎంపీ కవిత , ఈ రోజు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం తవ్వకాలకు అనుమతించిన నేపధ్యం లో ... యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ   సినీ , రాజకీయ ప్రముఖులతో పాటు అన్నివర్గాల వారు,  స్థానికులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన ప్రదర్శనల మద్దతునిస్తున్న ఈమె ఎందుకు స్పందించడం లేదని ? అని నిలదీస్తున్నారు .


 గతం లో నల్లమల పరిరక్షణే ధ్యేయంగా ఉద్యమించిన కవిత ... మరి నేడు ఎందుకు సేవ్  నల్లమల  ఉద్యమం లో భాగస్వామి కావడం లేదో అంతుచిక్కడం లేదంటూ విమర్శిస్తున్నారు . గతం లో కేంద్రం లో యూపీఏ ప్రభుత్వం ,  రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం తో రాజకీయ మైలేజీ కోసమే ఉద్యమించి , నేడు రాష్ట్రం లో తమ పార్టీ ప్రభుత్వం ఉండడం తో పర్యావరణ విధ్వంసాన్ని , చెంచుల హక్కులను కవిత తాకట్టుపెడుతున్నారా ? అంటూ  పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: