వైఎస్ జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. జగన్ పాలన అద్భుతమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతుంటే ప్రతిపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ 100 రోజుల పాలనలో పారదర్శకత లోపించిందని జనసేనాని ఆరోపించిన సంగతి తెలిసిందే. జగన్ పాలన జనవిరుద్ధంగా ఉందంటూ పవన్ విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో టీడీపీ, జనసేన ముందున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ పాలనపై నివేదిక ఇచ్చారు. అంతకు ముందే ఆయన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని నవులూరులో ఉన్న ప్రభుత్వ ఇసుక స్టాక్ యార్డ్‌‌ను పరిశీలించారు. టన్ను రూ. 375 అని చెప్పి రూ.900 చొప్పున అమ్ముతున్నారని విమర్శించారు.


జగన్‌ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్‌ లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం మీద ఏదైనా అనాలంటే అలా కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయనవసరం లేదని చెప్పండయ్యా ఎవరన్నా అంటూ పవన్‌పై సెటైర్లు వేశారు. ఇసుకను కిలో, పది కిలోల ‘ప్యాకేజీ’ల్లో అమ్మరని కూడా చెప్పండంటూ జనసేనానికి చురకలు అంటించారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఫ్రీగా అరేంజ్ చేసి ఉంటారు కాబట్టి రవాణా ఖర్చుల గురించి ఐడియా లేనట్టుందని ఎద్దేవా చేశారు.

మంగళగిరి సమీపంలో పవన్ కళ్యాణ్ కట్టుకున్న ఇంటికి టీడీపీ నేతలే ఇసుక సరఫరా చేశారనే అర్థం వచ్చేలా విజయసాయి ట్వీట్ చేశారు. దీనితో ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో ఒక రకమైన హీట్ పెరిగింది. ఇక పై ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయో లేక పవన్ కళ్యాణ్ తరుపునుంచి ఎలాంటి సంధానం ఇస్తాడో వేచి చూడాలి. ఆంధ్ర రాష్ట్ర రాజకియ కథలు కంచికి ఎప్పుడు చేరుతాయొ చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: