శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గత అరవై ఐదు సంవత్సరములకు పైగా ఆంధ్ర రాష్ట్ర,భారతదేశ సేవలో నిమగ్నమైన విశ్వ విద్యాలయం,భారత దేశంలో ఉన్న దాదాపు 800 విశ్వ విద్యాలయాలలో కన్నా ఎక్కువ కోర్సులు యూజీ,పీజీ, డిప్లొమా, ఇంజనీరింగ్,లా,ఫార్మసీ,బీ.ఈ.డి,ఎం.ఈ.డి,డాక్టరేట్,రీసెర్చ్ స్కాలర్,ఇంకా మరికొన్ని కోర్సులను ఒక్కటే గొడుగు క్రింద అందిస్తున్నదీ ఈ విశ్వ విద్యాలయం.ఇన్ని కోర్సులను అందిస్తున్న ఎస్వీయూ పరీక్షల నిర్వహణను ప్రస్తుత ఇంచార్జి రిజిస్ట్రార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



ఐతే,ప్రస్తుత ఇంచార్జి రిజిస్ట్రార్ హయాంలో మాత్రం ఎస్వీయూ పరీక్షల నిర్వహణ ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్లుందంటూ వాపోతున్నారు విద్యార్థులు.ఇంచార్జి రిజిస్ట్రార్ పాలనలో పరీక్షల నిర్వహణ కాదు కదా,కనీసం పరీక్షల నిర్వహణ తేదీలు,పరీక్షల దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుండి ప్రారంభమవుతుందో కూడా ప్రకటించలేదు.ఎప్పుడో నిర్వహించిన పరీక్షలకు ఇప్పటికి కూడా ఫలితాలను ప్రకటించలేదట,ప్రకటించిన ఫలితాలలో సవాలక్ష తప్పులట,ఈ ఘోరం ఎంత దూరం పోయిందంటే ఇంచార్జి రిజిస్ట్రార్ గారి హయంలో ప్రకటించిన ఫలితాల తప్పిదాల మూలంగా ఒక విద్యార్థి నిండు ప్రాణాన్ని బలవన్మరణంతో ముగించేంతగా అంటున్నారు విద్యార్ధి నాయకులు.ఎన్నెన్ని విధాలుగా మోర పెట్టుకున్న,ఎన్ని విజ్ఞాపనలు ఇచ్చినా కూడా. నవ్విపోదురు గాక నాకేమిటన్నట్లు తయారైంది ఇంచార్జి రిజిస్ట్రార్ గారి పరిస్థితి అని బహిరంగంగానే చెప్పి నెత్తీ నోరు కొట్టు కుంటున్నారట విద్యార్ధి నాయకులు.



మరి అభినవ ఇంటర్మీడియట్-గ్లోబరీనా ఉదంతాన్ని తలపిస్తున్న ఈ ఆరోపణాల్లో ఏవి నిజాలు అనేది ఎస్వీయూ ఇంఛార్జి రిజిస్ట్రార్ గారే చెప్పాలి.ఎస్వీయూ పరిథిలో విద్యార్ధి బలవన్మరణమ్ సత్యం,ఎస్వీయూ లక్షలాది పరీక్షల దరఖాస్తులు స్వీకరిస్తూ ఉండవలిసిన ఈ సమయానికి అస్సలు పరీక్షల ఊసేలేకుండా ఉండడం నిజమే..మరి మిగిలిన విషయాలు ఇంచార్జి రిజిస్ట్రార్ గారికీ ఆ పెరుమాళ్ వారికి మాత్రమే తెలియాలి.మరి వీరి ఘోష "జన ప్రియ నాయకుడు శ్రీ వై ఎస్ జగన్ మోహన రెడ్డి " గారి దృష్టికి వెళ్లాలని, ప్రజల ముఖ్యమంత్రి జగనన్న ఇలాంటి హేయమైన ఘటనలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం..  


మరింత సమాచారం తెలుసుకోండి: