కేసీయార్ మాటలు ఈటెల్లా ఒక్కోసారి అనిపిస్తాయి. మరోసారి ఆయన మాటలు మేధావులను సైతం ఆలోచింపచేస్తాయి. ఆయన ఎమోషనల్ గా మాట్లాడితే పండిత పామరులు సైతం చెవులు పెట్టి వినాల్సిందే. కేసీయార్ ఈ రోజు చేసిన కొన్ని కామెంట్స్ వింటే రాజకీయం ఇంత చవకబారుగా ఉంటుందా అనిపిస్తోంది. కేసీయార్ తన గురించి చెబుతూ ఒక్కసారి బరెస్ట్ అయ్యారు. ఆయన హ్రుదయాన్ని అలా  బయటపెట్టుకున్నారు.


నేను చనిపోతానని కూడా దారుణంగా విష ప్రచారం చేశారంటూ కేసీయార్ అన్న మాటలు అందరినీ ఒక్కసారి షాక్ కి గురి చేశాయి. తాను ఎక్కువ రోజులు బతకనని చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారని కేసీయార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు నా వయసు 66 ఏళ్ళు. నేను చాలా కాలం ఇంకా బతుకుతాను. అసలు నా మీద ఇలాంటి ప్రచారం ఏంటని కూడా ఆయన మండిపడ్డారు. 
ఇక తాను తెలంగాణాన్ని మరో మూడు టెర్ములు పాలిస్తానని కూడా కేసీయార్ కచ్చితంగా చెప్పేస్తారు.


తెలంగాణా అభివ్రుధ్ధి టీయారెస్ తో ముడిపడివుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణాలో మరే పార్టీ ఉండదని, కేవలం టీయారెస్ మాత్రమే ఉంటుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన కుమారుడు కేటీయార్ని ముఖ్యమంత్రిని చేస్తానని, తను బతికి ఉండనని జరుగుతున్న ప్రచారం తప్పు అంటూ ఆయన ఖండించారు.  మొత్తానికి చూస్తే కేసీయార్ మాటలు ఇపుడు వాడి వేడి చర్చకు దారితీస్తున్నాయి. ఈ మధ్యనే మంత్రి వర్గ విస్తరణ జరిపిన కేసీయార్ మేనల్లుడు హరీష్ రావుతో పాటు, కుమారుడు కేటీయార్ కి మంత్రి పదవులు ఇచ్చారు. తన రాజకీయ వారసుడు ఎవరో ఆయన తేల్చలేదు. అయితే హరీష్ సీఎం అని, కేటీయార్ సీఎం అని ఓ వైపు వినిపిస్తున్న వేళ కేసీయార్ ఈ కామెంట్స్ చేయడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: