గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారం చేజిక్కించుకున్న టిఆర్ఎస్... ఘన విజయాన్ని నమోదు చేసింది.రికార్డ్ స్థాయిలో సీట్లు  గెలిచి తెరాస జోరు చూపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత  కేసీఆర్  ఆరోగ్యం బాగాలేదని... అందువల్ల తన తనయుడు కల్వకుంట్ల తారక రామరావుని ముఖ్యమంత్రి ని చేస్తారని ఓ వైపు...కేసీఆర్  జాతీయ రాజకీయాల వైపు ద్రుష్టి పెట్టి ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్ కట్ట బెడతాడు అని వార్తలు వచ్చాయి   అయితే  సడెన్గా తెరాస పార్టీ బాధ్యతలు కేటీఆర్ కి అప్పగించటం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చాయి. బీజేపీ ని ఓడించటానికి ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటుకు    దేశ వ్యాప్తంగా మంతనాలు కూడా జరిపాడు కేసీఆర్ .  కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కెసిఆర్ ప్లాన్ రివర్స్ అయ్యి నాలుగు సీట్లు కోల్పోవడంతో కెసిఆర్ కాస్త సైలెంట్  అయ్యారు. దింతో కేటీఆర్ సీఎం అవుతాడు అన్న వార్తలకు  కూడా తెరపడింది. 

 

 

అయితే ఈ వార్త మరోసారి తెర మీదకి వచ్చింది. కేసీఆర్  ఆరోగ్యం అస్సలు బాలేదని... కేటీఆర్ కొద్దీ  రోజుల్లో సీఎం పదవి ఎక్కబోతున్నాడని వార్తలు జోరందుకున్నాయి..దీనిపై కేసీఆర్  క్లారిటీ ఇచ్చాడు. నా ఆరోగ్యం బాలేదని... కేటీఆర్ కి సీఎం పదవి అప్ప చెబుతానని... వస్తున్నా ప్రచారం అవాస్థవం.... ఇంకో పదేళ్లు నేనే సీఎం గా ఉంట...ఇంకో 20 ఏళ్ళు తెరాస అధికారంలో కొనసాగుతుంది అని స్పష్టం చేసారు కేసీఆర్. అయితే 20 ఏళ్ళు తెరాస అధికారంలోకి వస్తుందని వాక్యనించిన కేసీఆర్... పదేళ్లు మాత్రమే సీఎం పదవిలో ఉంటానని చెప్పటం తో... పదేళ్ల తర్వాత  కేటీఆర్ సీఎం అవుతాడని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: