టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు చేసిన ప‌నులే వైసీపీ విజ‌యానికి బాట‌లు వేసాయ‌ట‌.. చంద్ర‌బాబు చేసిన త‌ప్పుడు ప‌ద్ద‌తులు, త‌ప్పుడు నిర్ణ‌యాలు జ‌గ‌న్‌ను గద్దె ఎక్కించాయి.. చంద్ర‌బాబును గ‌ద్దె దింపాయి... అంతే కానీ ఇందులో వైసీపీ ఘ‌న‌త ఏమాత్రం లేద‌ట అంటున్నాడు ఇప్పుడే నిద్ర‌లోనుంచి లేచిన ఓ తెలుగు త‌మ్ముడు.. దొంగ‌లు ప‌డ్డ ఆరునెల‌ల‌కు కుక్క‌లు మొరిగిన సామెత‌గా ఉంది.. ఇప్పుడు ఈ తెలుగు త‌మ్ముడి వ్య‌వ‌హారం.. ఏపీలో ఎన్నిక‌లు అయిపోయి 100రోజులు పూర్తయినా.. ఇంకా తెలుగు త‌మ్ముళ్ళు ఎందుకు ఓడామా అనే వెతుకులాట‌లోనే ఉన్న‌ట్లు ఉన్నారు.


ఇప్పుడు ఈ తెలుగు త‌మ్ముడు మాత్రం అస‌లు నిజాలు చెపుతుండ‌టం విశేషం. ఇంత‌కు టీడీపీ ఓట‌మికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని చెపుతున్న ఈ తెలుగు త‌మ్ముడు ఎవ‌ర‌నుకుంటున్నారు.. పెన‌మ‌లూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోడె ప్ర‌సాద్‌. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోవ‌డానికి చంద్ర‌బాబు చేసిన మూడు త‌ప్పుల వ‌ల్లేన‌ట‌. ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ గెలువ‌లేద‌ట‌.. వైసీపీని టీడీపీ గెలిపించింద‌ట‌.. అంటే వైసీపీ గెలిచిన‌ట్లు కాదా ? అని అనుకునేరు.. ఈ తెలుగు త‌మ్ముడు అట్లాగే అంటున్నారు.. చంద్ర‌బాబు ప్యాకేజీల బాబు అనేది అంద‌రికి తెలిసిందే.. ఇప్పుడు ఈ తెలుగు త‌మ్ముడు కూడా అదే అంటున్నాడు.


ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల‌ని చెప్పి త‌రువాత యూట‌ర్న్ తీసుకుని ప్ర‌త్యేక ప్యాకేజీ ముద్దు అన్నాడ‌ట‌... వైసీపీ ఒకే మాట మీద ఉండి చివ‌రికంటా ప్ర‌త్యేక హోదా కోస‌మే పోరాటం చేసింది.. కానీ టీడీపీ చివ‌రిలో తామే ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్నామ‌ని బిల్డ‌ప్ ఇచ్చి చేజేతులారా ఓట‌మి కొని తెచ్చుకుంద‌ట‌.. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చంద్రబాబు అన‌వ‌సరంగా గోక్కున్నారట‌.. ఏపీకి, తెలంగాణ‌కు సంబంధం లేకున్నా.. తానే గొప్ప అనే విధంగా మాట్లాడి కేసీఆర్‌తో ఘ‌ర్ష‌ణ ప‌డ‌టంతో చంద్ర‌బాబుకు ఏపీలోని కొన్ని కులాలు దూరమై ఓట‌మి కొని తెచ్చుకున్నాడట‌.


దీనికి తోడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే ఏపీలో గెలిచేవాళ్ళంమంటూ ప్ర‌సాద్ వ్యాఖ్యానించారు. ఇక అస‌లు విష‌యం ఏంటంటే.. జ‌నాలు టీడీపీని మోసం చేయ‌లేద‌ట‌.. కానీ జ‌నాన్నే టీడీపీ స‌రిగా ఉప‌యోగించుకోలేక పోయింద‌ట‌.. వీటికి తోడు బీజేపీ వైసీపీకి అన్ని ర‌కాలుగా సాయం చేయ‌డంతో వైసీపీ గెలిచింద‌ని ఇది టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన త‌ప్పిద‌మే అంటూ బోడే ప్ర‌సాద్ అంటున్నారు.. సో వైసీపీ గెలుపు గెలుపు కాద‌ని, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబే గెలిపించాట‌..


మరింత సమాచారం తెలుసుకోండి: