కాంగ్రెస్‌లో ఆ ముగ్గురు నేతలు కేంద్రంలో  అధికారం  అనుభ‌వించారు...ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వారు పార్ల‌మెంట్ మెంబ‌ర్లుగా, కేంద్ర‌మంత్రుల‌గా అధికారం చెలాయించారు.. త‌మ ప్రాంతాల్లో ఏక‌చ‌త్రాధిప‌త్యంగా ఏలిన ఈ ముగ్గురు నేత‌లు కాంగ్రెస్ అధికారం పోగానే జంపింగ్ జ‌ఫాంగ్ పాట పాడుకుంటూ ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలో చేరిపోయారు.. వీరి రాక‌తో అధికారంలో ఉన్న పార్టీకి ప‌ట్ట‌ప‌గ్గాల్లేకుండా పోయాయి.


ఇంత పెద్ద లీడ‌ర్లు పార్టీలోకి వ‌స్తున్నారంటే.. మా పార్టీకి తిరుగులేదు.. అనుకున్నాడు టీడీపీ అధ్య‌క్షుడు చంద్రాలు. కానీ ఎంత‌మంది పెద్దత‌ల‌కాయ‌లు పార్టీలో చేరినా.. టీడీపీ త‌ల‌రాత‌ను మార్చ‌లేక‌పోయారు.. ఆ పార్టీ ఓటమిని ఆప‌లేక‌పోయారు.. స‌రిక‌దా.. వారు గెలువులేక పోయారు. అయితే ఎన్నిక‌ల ముందు పార్టీలో చేరి టికెట్లు పొంది.. అన‌క ఓడిపోయి... ప‌రువు బ‌జారున ప‌డేసుకుని ఇప్పుడు మొహం చాటేశారు. మొహం చాలేసింది కేవ‌లం ప్ర‌జ‌ల‌కే కాదు.. అటు పార్టీకి కూడా.. ఇంత‌కు ఈ ముగ్గురు ఎవ‌ర‌నుకుంటున్నారా... వారే కేంద్ర‌మాజీ మంత్రులు. వారే.. కిశోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.


వీరిలో ఒక్కొక్క‌రికి ఒక్కో నేప‌థ్యం ఉంది.. ప్ర‌జ‌ల్లో బాగా ప‌లుకుబ‌డి ఉన్న నేత‌లు.. వీరంతా దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో కేంద్ర‌మంత్రులు అయిన‌వారు.. అయినా వైఎస్ మ‌ర‌ణం త‌రువాత ఆయ‌న కొడుకు వైఎస్ జ‌గ‌న్‌కు అండ‌గా ఉండ‌కుండా.. అధికారమే ధ్యేయంగా కాంగ్రెస్‌, టీడీపీలో ప‌నిచేశారు..
ఈ ముగ్గురు బ‌ల‌మైన నేత‌లు కావ‌డంతో వైసీపీని చావుదెబ్బ కొట్టొచ్చ‌ని గ్ర‌హించి టీడీపీలో చేర్చుకుంటే ఇప్పుడు టీడీపీ చావుదెబ్బ తింది.. దీంతో వీరి విస్త‌రి చినిగింది.. ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోక అటు పార్టీ వైపు, ఇటు ప్ర‌జ‌ల వైపు క‌న్నేత్తి చూడ‌టం లేద‌ట‌.. అయితే విశాఖ‌ప‌ట్నంలో చ‌క్రం తిప్పే కిషోర్ చంద్ర‌దేవ్‌, చిత్తూరు ప్రాబ‌ల్యం ఉన్న ప‌న‌బాల ల‌క్ష్మీ, క‌ర్నూలు తిరుగులేని నేత కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డిలు ఎన్నిక‌ల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. వీరితో పాటు పార్టీ ఓడింది.


ఈ క‌ష్ట కాలంలో పార్టీకి అండ‌దండ‌గా ఉంటార‌ని భావించిన చంద్ర‌బాబుకు వీరి వ్య‌వ‌హారం అంతుచిక్క‌కుండా మారింది. వీరు పార్టీలో ఉన్నా లేన్న‌ట్టే లెక్క‌.. వీరి అనుభ‌వం ఇప్పుడు పార్టీకి ఉప‌యోగించుకుందామంటే.. చిక్క‌రు దొరుక‌రు.. వీరి వ్య‌వ‌హారంతో చంద్ర‌బాబు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడ‌ట‌.. అయితే ఇప్పుడు వీరు కూడా అటు బీజేపీలోకి పోవాలా.. లేక అధికారంలో ఉన్న వైసీపీలోకి పోవాలా.. అనే డైలామాలో ఉండి.. టీడీపీకి మొహం చాటేస్తున్నారేమో అనే అనుమానాలు క‌లుగుతున్నాయ‌ట చంద్ర‌బాబుకు.


మరింత సమాచారం తెలుసుకోండి: