ఏపీకి యువ‌రాజ్యం వ‌చ్చింది. ఇంత‌కాలం 40ఏండ్ల రాజ‌కీయ ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే రాజ‌కీయాల‌కు చెక్ పెట్టిన ఏపీ ప్ర‌జ‌లు యువ‌నాయ‌క‌త్వం కు ప‌ట్టం క‌ట్టారు. ప‌ట్టం అంటే అట్లాంటి ఇట్లాంటి ప‌ట్టం కాదు.. ఏపీలో ఏకంగా 75 శాతం మంది ఎమ్మెల్యేలు యువ‌కులే ఎన్నిక‌య్యారు. ఇక ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న పార్టీలో యువ‌త‌కు పెద్ద పీట వేశాడు. అందులో త‌న మంత్రివ‌ర్గంలోనూ యువ‌త‌కు అవ‌కాశాలు ఇచ్చాడు. అందులో భాగంగా ఏపీకి నీటిపారుద‌ల శాఖ‌మంత్రిగా అనిల్ కుమార్‌ యాద‌వ్ ను నియ‌మించారు.. ఈపేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. అనిల్ మంత్రిప‌ద‌వికి కొత్త కావొచ్చు కానీ.. ప‌నితీరుతో మాత్రం అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నాడు.


నెల్లూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్ యాద‌వ్ జ‌గ‌న్ క్యాబీనెట్‌లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా నియ‌మితులైనారు. వాస్త‌వానికి అనిల్ యాద‌వ్ కుటుంబం రాజ‌కీయ కుటుంబ‌మే. కాకుంటే కేవ‌లం మండ‌ల‌స్థాయి వ‌ర‌కు ప‌నిచేసిన కుటుంబ‌మే. అనిల్ బీడిఎస్ వ‌ర‌కు చ‌దువుకుని కాంగ్రెస్‌లో ఆనం సోద‌రుల అనుచ‌రుడిగా పార్టీలో చేరాడు. త‌రువాత 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. త‌రువాత వైఎస్ జ‌గ‌న్ అనుచ‌రుడిగా వైసీపీలో క్రియాశీల‌కంగా ప‌నిచేశాడు. జ‌గ‌న్‌ను సీఎంగా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేశారు అనిల్ యాద‌వ్.  


జ‌గ‌న్ కు విశ్వాస‌పాత్రుడిగా ప‌నిచేసిన అనిల్‌యాద‌వ్‌ను మంత్రిగా చేయ‌డం అంద‌రిని విస్మ‌యానికి గురి చేశాడు. నెల్లూరు జిల్లాలో ఎంతోమంది మ‌హామ‌హులు ఉన్నా కూడా జ‌గ‌న్ మాత్రం అనిల్‌కే త‌న కేబినెట్‌లో చోటు ఇచ్చారు. భారీ నీటిపారుద‌ల శాఖ‌మంత్రిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టిన అనిల్ యాద‌వ్ త‌న‌దైన మార్క్ గా ప‌నిచేయ‌డం ప్రారంభించారు. సీఎం జ‌గ‌న్ తీసుకున్న ప్ర‌తి కార్య‌క్ర‌మానికి తాను తోడుగా ఉంటూ నీటిపారుదల శాఖ‌లో గ‌త టీడీపీ పాల‌న‌లో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల వెలికితీత‌పై దృష్టి సారించాడు. టీడీపీ పాల‌న‌లో చేప‌ట్టిన ప‌ట్టిసీమ, పోల‌వ‌రంతో పాటు అనేక ప్రాజెక్టుల్లో జ‌రిగిన అవినీతిని వెలికితీసే ప‌నిలో మునిగిపోయాడు.


పోల‌వ‌రం ప్రాజెక్టులో కోట్లాది రూపాయ‌లు ప‌క్క‌దారి ప‌ట్టాయ‌ని గ్ర‌హించి టెండ‌ర్లు ర‌ద్దు చేయ‌డం, రీ టెండ‌రింగ్‌కు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ముందున్నాడు. ఇక టెండ‌ర్ల ర‌ద్దుతో ఏపీలో రేగిన నీటి మంట‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేశాడు. పోలవ‌రం టెండ‌ర్ల ర‌ద్దుపై టీడీపీ చేసిన రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను త‌న వాగ్ధాటితో తిప్పికొట్టారు. ఏపీ అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌ల్లోనూ టీడీపీ నేత చంద్ర‌బాబు నాయుడు, ఉప నేత అచ్చెన్నాయుడికి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. ఇక  చంద్ర‌బాబు నాయుడు కృష్ణ క‌ర‌క‌ట్ట‌పై ఉంటున్న నివాస గృహం నీటిలో మునిగిపోతున్న స‌మ‌యంలోనూ త‌న‌దైన శైలీలో స్పందించాడు. ఇక ఇదే క‌ర‌క‌ట్ట‌పై అక్ర‌మంగా వెలిసిన ఓ ప్ర‌భుత్వ భ‌వ‌నం కూల్చివేత పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పైనా ఆయ‌న ఘాటుగానే స‌మాధానాలు ఇచ్చి ప్ర‌తిప‌క్షం నోరు మూసారు.


వీటికి తోడు అనిల్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కాలంలోనే క‌నివినీ ఎరుగ‌ని  రీతిలో భారీ వ‌ర‌ద‌లు వ‌చ్చి కృష్ణా, గోదావ‌రి న‌దులు పొంగిపొర్లాయి.. వీటితో పాటుగా కృష్ణా, గోదావ‌రి న‌దుల అనుసంధానంపై తెలంగాణ ప్ర‌భుత్వంతో జ‌రిగిన చ‌ర్చ‌ల్లోనూ క్రియాశీల‌క పాత్ర పోషించాడు. ఇక న‌దులు పొంగి పొర్లి లోత‌ట్టు లంక గ్రామాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే వారి కోసం నిరంత‌రం శ్ర‌మించాడు. ఇక ఏనాడు లేని విధంగా కృష్ణా, గోదావ‌రి న‌ది ప‌రివాహాక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులు నిండామునిగి ఏపీ క‌రువును తీరింది. మొత్తానికి 100 రోజుల పాల‌న‌లో నీటి పారుద‌ల శాఖ మంత్రిగా అనిల్ యాద‌వ్ పోల‌వ‌రం, కృష్ణా, గోదావ‌రిన న‌దులు అనుసంధానంపై చేప‌ట్టిన చ‌ర్య‌లు ఆయ‌న విజ‌యాలుగానే నిలుస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: