ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల తీరుపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్ 100 రోజుల పాలన అని ఓ బుక్ లెట్ ని విడుదల చేశారు పవన్ కళ్యాణ్. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో కాపు నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 


టీడీపీ నేత తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పి ఈరోజు వైసీపీలో చేరారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తోట త్రిమూర్తులు ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డికి భయపడి ఎవరూ వైసీపీలో చేరడం లేదని, పాలన చూసి ఆ పార్టీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. 


ఈ నేపథ్యంలోనే మరో కాపు నేత ఆమంచి కృష్ణ మోహన్ కూడా పవన్ కళ్యాణ్ మాటలపై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఆలా మాట్లాడడటం దుర్మార్గం అని, ఆ మాట అనడం ద్వారా అతన్ని అతను అవమానించుకున్నాడని అయన పేర్కొన్నారు. కాగా అతను కూడా వారి సామాజికవర్గానికి చెందిన నేత అని అన్నారు. 


పవన్ కళ్యాణ్ అతని వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ తో పాటు అన్ని కులాలవారు నడవాలనుకుంటున్నారని అయన పేర్కొన్నారు. కాగా గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పాలన ఎంత ఘోరంగా ఉందొ అందరికి తెలుసు కానీ అతని పాలనపై ఒక్కసారి కూడా రిలీజ్ చెయ్యని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారని ప్రశ్నించారు. కాగా అతను మాట్లాడిన ప్రతి మాట టీడీపీ మాటే అని అయన పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: