ఏ ప్రభుత్వం అయినా మళ్లీ అధికారంలోకి రావాలి అనుకుంటుంది. రాజకీయాల్లో సర్వసాధారణమే కూడా.  కాబట్టి  ప్రజల్లో అసంతృప్తి పెరిగే కొలదీ వచ్చే ఎలక్షన్స్ లో ఓట్లు తగ్గుతాయి. ఇలాంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు నాయకులు, ఆయా పార్టీ అధినేతలు సర్యేలు చేయించుకోవడం కూడా మాములే. ఈ క్రమంలో    అధికారంలోకి వచ్చిన,  అధికారాన్ని కోల్పోయిన  రాజకీయ పార్టీలు మాత్రం ప్రజల డిమాండ్స్ లౌడ్ గా ఉంటే పట్టించుకుంటాయి. తాను చేసే ప్రతీ పనికీ ప్రజల అంగీకారం ఉండాలి అనుకోదు. కానీ  ప్రజల వ్యతిరేకత మాత్రం ఉండకూడదు అనుకుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే  ఏ అంశంపైన ఎక్కువగా స్పందిస్తున్నారు..ఏ విషయంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు వంటి అంశాలపైన ముఖ్యంగా పాలకపక్షాలు దృష్టిని కేంద్రీకరిస్తాయి. ఈ క్రమంలోనే  ఎలాంటి అంశాలపైన వార్తలు ఎక్కువసార్లు రిపీట్ అయింది, అనే డేటా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ దిశగా ఆలోచన చేస్తే..సోషల్ మీడియాలో బర్కింగ్ ఇష్యు అయిన    సేవ్ నీలిమల పోస్టులను పెట్టాలని అనిపిస్తుంది కదా మరి. ఇంకేం సోషల్ మీడియాలో ఎంచక్కగా ప్రజా సమస్య పరిష్కారానికి ఉద్యమించండి ఇక. 
సో ఫైనల్ గా చెప్పొచ్చేదేమిటంటే, సోషల్ మీడియా ఉద్యమాల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. కాకపోతే గ్రౌండ్ లెవల్ ఉద్యమంతో పోలిస్తే వంద రెట్లు ఎక్కువమంది స్పందించాల్సి ఉంటుంది. అమ్రాబాదుకు వెళ్లి, చెంచుల పక్కన నిలబడి వంద మంది ఉద్యమం చేసే ఇంపాక్ట్ సోషల్ మీడియాలో రావాలి అంటే,  పది వేలమంది పోస్టులు పెడితే వస్తుంది. పోస్టులు పెట్టడానికి డబ్బులు, సమయం ఖర్చు కావు కాబట్టి, భావప్రకటన స్వేచ్ఛను వాడుకునే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది.  కాబట్టి పదివేల మందే ఎందుకు అన్న ప్రశ్న ఉప్పన్నం కావచ్చు కూడా. పది లక్షల మందైనా స్పందిస్తేకాని పాలకుల్లో చలనం కలగదు మరి.
ప్రభుత్వం ఆ డేటాను నిధులు అవసరం అయ్యేవి, నిధులు అవసరం లేనివి అనే రెండుగా విభాగాలుగా విడదీస్తుంది. అదనంగా నిధులు అవసరంలేని పనులకు త్వరగా స్పందిస్తుంది. తక్కువ నిధులు ఖర్చు అయ్యేవాటికి సెకండ్ ప్రాధాన్యత ఇస్తుంది. నిధులు ఎక్కువ ఖర్చు అయ్యేవాటిని పెద్దఉద్యమం జరిగితే తప్ప స్పందించదు. అసలు ప్రభుత్వం వీటిని ఎందుకు పట్టించుకుంటుంది అన్న అంశంపైన దృష్టి పెట్టండండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: