ఏపీలోని అనంతపురం జిల్లా అధికార పార్టీ లో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. జిల్లాలో జూనియ‌ర్ అయిన మంత్రి, సీనియ‌ర్ అయిన ఎమ్మెల్యే మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న‌ట్టు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. జిల్లా వైసీపీలో అనంత వెంక‌ట్రామిరెడ్డి సీనియ‌ర్‌. ఆయ‌న గ‌తంలో ఎంపీగా ప‌నిచేశారు. వైఎస్ ఫ్యామిలీకి అనుంగు అన‌చ‌రుడు. అయితే ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో అనంత‌పురం అర్బ‌న్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఆశించారు.


జ‌గ‌న్ మాత్రం బీసీ కోటాలో పెనుగొండ నుంచి గెలిచిన శంక‌ర్ నారాయ‌ణ‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇక శంక‌ర్ నారాయ‌ణ మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి మూడు నెల‌లు కూడా అయ్యింది. ఇప్పటివరకు మంత్రి పాల్గొన్న ఏ కార్యక్రమంలోనూ అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొనలేదు. మంత్రి కార్య‌క్ర‌మాల్లో ఎమ్మెల్యే పాల్గొనాల‌ని రూల్ లేదు. అయితే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్రొటోకాల్ ప్ర‌కారం అయినా ఎమ్మెల్యే మంత్రితో పాటు ఉండాలి. కానీ ఇక్క‌డ అది జ‌ర‌గ‌డం లేదు. అనంత త‌న నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క్ర‌మాల్లో కూడా మంత్రితో క‌లిసి ఎందుకు ? పాల్గొనడం లేదు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.


అనంత వెంక‌ట్రామిరెడ్డి జిల్లా రాజ‌కీయాల్లో చాలా సీనియ‌ర్‌. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. అనంత నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వ‌ర‌కు అన్నీ ఆయ‌న‌కు కొట్టిన పిండే. అందుకే ఈసారి ఆయన వైసిపి మంత్రివర్గంలో స్థానం సంపాదిస్తారని అందరూ అనుకున్నారు. అయితే సామాజిక ఈక్వేషన్ లను బట్టి శంకరనారాయణకు మంత్రి పదవి ఇచ్చారు. వాస్త‌వంగా చూస్తే శంక‌ర్ నారాయ‌ణ చాలా చాలా జూనియ‌ర్‌. ఆయ‌న తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది.


ఈ క్ర‌మంలోనే చాలా సీనియ‌ర్‌గా ఉన్న అనంత త‌న క‌న్నా చాలా జూనియ‌ర్ అయిన మంత్రి శంక‌ర్ నారాయ‌ణ‌తో క‌లిసి కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాలంటే చాలా ఇబ్బందిగా ఫీల‌వుతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక జిల్లా కేంద్ర‌మైన అనంత‌పురంలో శంక‌ర్ నారాయ‌ణ ప్ర‌తి కార్య‌క్ర‌మంలో మంత్రి హోదాలో పాల్గోవాలి. ఇక ఇక్క‌డే ఇద్ద‌రి మ‌ధ్య చాలా గ్యాప్ ఎక్కువ‌వుతోంద‌ట‌. మ‌రి ఈ వివాదం ఎలా ముగుస్తుందో ?  చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: