మీడియా జరగబోతున్న ప్రమాదం గురించి ఒకరోజు ముందే హెచ్చరించినా...  అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈస్ట్ గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు టూరిస్తు బోటులో తొమ్మిది మంది సిబ్బందితో సహా 60 మంది ప్రయాణిస్తుండగా.... అందులో 12 మంది మునిగిపోగా 23 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఇంకా 30 మంది కనిపించకుండా పోయారు. దేవీపట్నం దగ్గర ఉన్న గండి పోచమ్మ గుడి నుంచి పాపికొండల వైపు వెళుతున్న బోటు కచులూరు వద్ద ఒక సైడ్ కి ఒంగిపోయి చాలాసేపు అదే పొజిషన్ లో ఉన్న బోటు చివరికి బోల్తా పడిపోయింది.

దీనిపై పలు మీడియా వర్గాలు ప్రమాదానికి ఒకరోజు ముందే పొంచి ఉన్న ముప్పు గురించి ప్రచురణలు చేశారు. మీడియా వీలైనంత త్వరగా అధికారులను పాపి కొండల వైపు నడిచే బోట్లను ఆపివేయాలని వారు హెచ్చరించారు. సెప్టెంబర్ 14వ తేదీన ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక న్యూస్ ఆర్టికల్ లో పాపి కొండల వైపు వెళ్తున్న బోట్లకు ప్రమాదం పొంచి ఉందని వారు అన్నారు. కానీ అవేమీ పట్టించుకోకుండా పర్యాటకుల ప్రాణాలతో చెలగాటం ఆడిన అధికారులు ప్రమాదం జరిగిన వెంటనే కూడా సరైన సమయానికి సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే అన్నీ సర్వీసులు ఆపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డు సిబ్బంది వద్ద లైసెన్స్ చెక్ చేయించి… అధికారులను ఒక ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా నదులలో బోట్లు తిరిగేందుకు అవసరమైన గైడ్ లైన్స్ సూచించమని అడిగారు. ఈ దురదృష్టకర సంఘటనపై అతనికి పూర్తి రిపోర్టు ఇవ్వాలని కూడా ఆదేశించాడు. ఏదేమైనా చికిత్స కన్నా నివారణ మేలు అన్నట్లు... అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే ఒక పెను ప్రమాదం జరిగింది. ఇకనైనా అధికారులు బోట్ల రాకపోకలు సంబంధించి అనుమతులను అన్నీ కోణాల్లో  పరిశీలించి ఇవ్వకపోతే మరిన్ని ప్రాణాలు నీళ్లలో కలవక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: