కాలం మారింది.. 24 గంటల సమయం సరిపోవడం లేదు.  తిండి, నిద్ర మానుకొని పనులు చేస్తున్నారు. కెరీర్ కోసం కష్టపడుతున్నారు.  సెటిల్ అయ్యాక.. అంతకు మించి ఎదగడానికి ప్రయత్నాలు.. జీవితం అంతా కష్టపడటంతోనే సరిపోతుంది.  శరీరంలో సత్తువ ఉన్నంతకాలం పని చేస్తాం.  శక్తి తగ్గిపోతే.. పనిచేయగలమా.. వయసు పెరిగేకొలది వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది.  రెస్ట్ లేకుండా పనిచేసే వారిలో వ్యాధినిరోధక శక్తి త్వరగా తగ్గిపోతుంది.  వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడానికి నిద్రలేమి ఇక కారణం.  


మనిషికి కనీసం 7 గంటల నిద్ర అవసరం.  తప్పకుండా 7 గంటలపాటు నిద్రపోవాలి.  లేదంటే ఇబ్బందులు వస్తాయి.  మనం 7 గంటలు నిద్రపోతున్నామా.. ఒక్కసారి ఆలోచించండి.  నిద్రలేకపోతే.. ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసుకదా. నిద్రలేమి నుంచి బయటపడాలి అంటే ఎం చేయాలి.. 


సాధారణంగా వారాంతంలో వచ్చే సెలవు రోజుల్లో వారానికి సరిపడా పనులు పెట్టుకుంటాం.  ఆరోజు కూడా రెస్ట్ ఉండదు.  మొబైల్ ఫోన్ బ్యాటరీ డిస్చార్జ్ తరువాత తప్పని సరిగా ఛార్జ్ చేయాలి.. అలాగే శరీరానికి ఛార్జ్ అవసరం.. అందుకే వారాంతంలో తప్పని సరిగా బయటకు వెళ్ళాలి.. వీలయితే.. మ్యూజిక్ పార్టీలకు వెళ్ళండి.  ఆలా వెళ్లడం వలన అక్కడ ఉండే లైట్స్ కళ్లపై ఫోకస్ అవుతుంది.  సహజంగా ఎక్కువ కాంతి కంటిపై పడినపుడు కళ్ళు తెలియకుండానే అలసిపోతాయి.. నిద్రవస్తుంది.  


నిద్రలేమితో బాధపడే వారికి మ్యూజిక్ పార్టీలు ఉపయోగకరంగా ఉంటాయని ఇటీవల పరిశోధనలో తేలింది.  శరీరంలో ఉండే బయోలాజికల్ గడియారానికి ఒక సమయాన్ని అలవాటు చేస్తే.. దాని ప్రకారం అది పనిచేసుకుంటూ పోతుంది.  నిద్రకు ఖచ్చితంగా సమయాన్ని కేటాయించండి.  అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.  మనసు ఉల్లాసంగా పనిచేస్తుంది.  రోజంతా హాయిగా పనిచేయడానికి కావలసిన శక్తి శరీరానికి అందుతుంది.  తప్పకుండా ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: