పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఆ క్రేజ్ 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైంది అయినా.. టీడీపీ పవన్ కు ఇచ్చిన గుర్తింపేమీ లేదు.. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి తప్ప. ముఖ్యంగా.. పవన్ ను తక్కువ చేసి ఎన్నో అవమానాలకు గురి చేసిన కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు ఇప్పుడు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారిపట్ల వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాయి.

 


“మేం అధికారంలోకి రావడానికి పవన్ చేసిందేమీ లేదు” అని దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తక్కువ చేసి మాట్లాడారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసారన్న ఆరోపణలతో ఆయన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఎదుర్కోవాల్సి వస్తోంది. పవన్ విశాఖలో చేపట్టిన పాదయాత్రను కనీసం కవర్ చేయకుండా పక్కా టీడీపీ పీఆర్వో చానెల్స్ గా పని చేసాయి కొన్ని మీడియా సంస్థలు. ఓ మహిళ పవన్ తల్లిని అనరాని మాట అంటే దాన్ని కూడా సపోర్ట్ చేసే కథనాలు రాసి, ప్రసారం చేసింది సదరు మీడియా సంస్థ. వీటన్నింటినీ పవన్ ఒక్కడే ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వీరి వ్యవహారంతో విసిగిపోయిన మరో వ్యక్తి.. నేటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. యాధృచ్చికమే అయినా వీటన్నింటితో పవన్, జగన్ ఇబ్బంది పడ్డారన్నది నిజం.

 


ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు, పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా లేని వ్యతిరేకతను విపరీతంగా ప్రసారం చేసినందుకు ఆయా మీడియా సంస్థలను ప్రభుత్వం బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడీ ప్రభుత్వ నిర్ణయాలన్నీ పవన్ ఫ్యాన్స్ కు సంబరాలుగా మారాయి. ఈ సంఘటనలతో వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు పవన్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారని వినికిడి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: