పాపికొండ‌లు.. ఇది అంద‌మైన ప్ర‌దేశం.. ఇక్క‌డి వెళ్ళాల‌ని, అక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను త‌నివితీరా చూసి త‌రించి పుల‌కుంచి పోవాల‌నుకున్న వారికి అది ఓ స్వ‌ర్గ‌థామం. అయితే ఈ అందాల పాపికొండ‌ల‌కు వెళ్ళె యాత్రికులు ఎప్పుడు ప్ర‌మాదాల భారీన ప‌డి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాపికొండ‌లు వెళ్ళాలంటే ప్రాణాలు పోగోట్టుకోవాల్సిందేనా అనే విధంగా ఈ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. అయితే పాపికొండ‌ల అందాల తీరంకు వెళుతూ మూడుసార్లు ఇలా బోట్ల ప్ర‌మాదాలు జ‌రిగి ఇప్ప‌టికి అనేక‌మంది అసువులు బాసారు. అయితే పాపికొండ‌లు వెళ్ళే ఈ గోదావ‌రి న‌దిలో క‌చ్చ‌లూరు వ‌ద్ద ప్ర‌మాదాల‌కు డేంజ‌ర్ జోన్ అంటున్నారు నిపుణులు.


అయితే తూర్పుగోదావ‌రి జిల్లా క‌చ్చ‌లూరు వ‌ద్ద ఆదివారం జ‌రిగిన బోటు ప్ర‌మాదం జ‌రిగి అనేక‌మంది గ‌ల్లంతు కావ‌డం, 17మంది వ‌ర‌కు మృతిచెంద‌డం జ‌రిగింది. అయితే క‌చ్చ‌లూరును డేంజ‌ర్ జోన్ గా అభివ‌ర్ణిస్తార‌ట‌. అయితే ఈ ప్రాంతంలో ఎందుకు బోటు య‌జ‌మానులు, డ్రైవ‌ర్లు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు.. యాత్రికుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు.. అంటే దీనికి స‌మాధానాలు లేని ప్ర‌శ్న‌లుగానే మిగులుతున్నాయి.


అయితే పాపికొండ‌ల‌కు వెళ్ళెవారు క‌చ్చ‌లూరు వ‌ద్ద‌నే ఇప్ప‌టికి మూడు పెద్ద ప్ర‌మాదాలు జ‌రిగాయ‌ని చ‌రిత్ర చెపుతుంది. పాపికొండ‌లుకు వెళ్ళాలంటే ఎగువ‌కు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. సుమారు గంట ప్ర‌యాణం చేస్తే త‌ప్ప పాపికొండ‌లు రాద‌ట‌. అయితే ఈ క‌చ్చ‌లూరు వ‌ద్ద ఇప్పటికే రెండు ప్ర‌మాదాలు జ‌రుగ‌గా, ఇప్ప‌టికి మూడో ప్ర‌మాదం. 1964లో ఓసారి ఉద‌య్‌భాస్క‌ర్ అనే బోటు ప్ర‌మాదం జ‌రిగి 60మంది మ‌ర‌ణించారు. మ‌రోమారు ఝాన్సీరాణి అనే బోటు ప్ర‌మాదంలో 8మంది మృతి చెందారు. ఇప్పుడు మ‌రోమారు ప్ర‌మాదం జ‌రిగింది.


ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 12మంది మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. అంటే ఇక్క‌డ ఇది ఈ ప్ర‌మాద‌మే మొద‌టిది కాదు. అయితే ఈ ప్రాంతంలోనే ఓ పెద్ద రాయి ఉండ‌టంతో ప్ర‌వాహ ఉదృతి బాగా ఉండ‌టంతో ఈ ప్ర‌మాదాల‌కు నెలువుగా మారింద‌ని అంటున్నారు.. అయితే ఈ ప్ర‌మాదాల‌ను నివారించే చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో బోటు య‌జ‌మానులు, డ్రైవ‌ర్ల‌తో పాటు పాల‌కుల నిర్ల‌క్ష్యం కార‌ణం అని చెప్ప‌క త‌ప్ప‌దు. 


మరింత సమాచారం తెలుసుకోండి: